MOVIE NEWS

బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..?

నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాప్పబుల్ అంటూ నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.ఊర మాస్ స్క్రిప్ట్స్ ఎంచుకొని భారీ హిట్స్ అందుకుంటున్నారు.. బాలయ్య గతంలో నటించిన అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి..రీసెంట్ గా బాలయ్య డాకూ మహారాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా వున్నా కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం సూపర్ టాక్ వచ్చింది.. ఈ సినిమాలో సైతం బాలయ్య తన ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. బాలయ్య యాక్షన్ కి తమన్ మాస్ బిజీఎం తోడై ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ అండ్ యాక్షన్ సినిమా లభించింది..

వావ్ : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..!!

రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమా  సూపర్ టాక్ తో దూసుకుపోతుంది.. ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం అనే మూవీతో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ గా జరుగుతుంది..ప్రగ్యా జైశ్వాల్,సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖండకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాక్స్ లు బద్ధలు కొట్టిన తమన్ మరోసారి ఈ సీక్వెల్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి కీలకమైన అప్డేట్ వైరల్ అవుతుంది.

ఈ సారి దసరా పండగ అక్టోబర్ 2న రావడంతో అఖండ 2 ను మేకర్స్ సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ డేట్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే అని సమాచారం… అందుకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం..దసరా పండుగకు వారం ముందే బాలయ్య ఫ్యాన్స్ కి తన సినిమాతో అసలైన దసరా గిఫ్ట్ ఇవ్వనున్నాడు..

 

 

Related posts

ఎస్ఎస్ఎంబి : హమ్మయ్య ఎట్టకేలకు మొదలు పెడుతున్న జక్కన్న..!!

murali

మెగా vs అక్కినేని.. ఊహించని కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

murali

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

murali

Leave a Comment