MOVIE NEWS

బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పటికే 3 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో తాజాగా 4 వ సీజన్ కూడా అద్భుతంగా జరుగుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో అల్లుఅర్జున్, సూర్య, వెంకటేష్, తాజాగా రాంచరణ్ గెస్ట్ గా వచ్చి ఎంతగానో ఎంటర్టైన్ చేసారు..ఇదిలా ఉంటే బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా డాకు మహారాజ్ టీం బాలయ్య షో కి గెస్ట్ లు గా వచ్చారు.. ఈ క్రమంలో బాలయ్య బాబీ సినిమాల హీరోల గురించి ప్రస్తావించగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన కావాలనే లేకుండా చేశారని ప్రచారం జరుగుతుంది.అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు,.

అయితే ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో కూడా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం ఏమీ నిజం కాదని దర్శకుడు బాబీ పేర్కొన్నారు.షోలో పాల్గొన్న సమయంలో స్క్రీన్ మీద ఏ ఫోటోలు వచ్చాయో వాటి గురించి మాట్లాడామని అంతకుమించి ఎడిట్ చేయాల్సింది, దాచాల్సింది ఏమీ లేదని వారు అన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న సమయంలో తనతో అలాగే నాగ వంశీతో పలానా సినిమాలో అయితే తారక్ బాగా చేసి ఉండేవాడని బాలయ్య అన్నారని బాబీ పేర్కొన్నారు. జై లవకుశ తనకు బాగా నచ్చిన సినిమా అని బాలకృష్ణ రెండు మూడు సందర్భాలలో తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా బాబీ చెప్పారు.

Related posts

సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!

murali

పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!!

murali

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

filmybowl

Leave a Comment