నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే అన్స్టాపబుల్ టాక్ షోలో హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో ఈ షో ప్రసారం అవుతుంది.. ఈ షో కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.. ప్రస్తుతం నాలుగో సీజన్ జరుగుతుంది.. ఈ సీజన్ లో అల్లుఅర్జున్, సూర్య, రాంచరణ్ వంటి స్టార్స్ పాల్గొని ఎంతగానో సందడి చేసారు.. అయితే తాజాగా “ డాకు మహారాజ్ “ టీం ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాప్పబుల్ షో కి వచ్చారు..
గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!!
ఆ షో లో బాలయ్య దర్శకుడు బాబీని తాను చేసినా హీరోల గురించి వరుసగా ప్రస్తావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదని, ఇందుకు సంబంధించిన అంశంపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ముఖ్యంగా బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిని ప్రస్తావించి, ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ గురించి మాట్లాడకపోవడం హాట్ టాపిక్ గా మారింది..అభిమానులు దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ‘డాకు మహారాజ్ ‘సినిమా బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ప్రస్తావించారని, కానీ ఎడిటింగ్ సమయంలో ఆ భాగాన్ని కట్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగ వంశీ ఈ వివాదంపై స్పందించారు.
షోలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ, ‘జై లవకుశ’ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తావన రాకపోతే కట్ చేయాల్సిన పరిస్థితి కూడా అస్సలు ఉండదని ఆయన వివరించారు. అయితే, ఆఫ్ ది కెమెరా సందర్భంలో బాలయ్యతో మాట్లాడిన సందర్భంలో ఏదో ఒక పాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అన్నట్లు నాగ వంశీ పేర్కొన్నారు.అంతేకాకుండా ఇలాంటి వివాదాలు సినిమా విడుదలకు ముందు చెలరేగడం సరైంది కాదని, ఈ వివాదాలు అభిమానుల మధ్య అనవసరమైన గొడవలకు దారితీస్తున్నాయన్న నాగవంశీ ఆవేదనను వ్యక్తం చేశారు