MOVIE NEWS

ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ డాకూ మహారాజ్‌”. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అలాగే ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.. బాలయ్యకి తమన్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు..

వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా రు. 180 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. డాకు మహారాజ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సైతం అదరగొడుతుంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ “ అఖండ : తాండవం “ తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య నటిస్తున్న నాలుగో మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుందటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే అటు షూటింగ్ తో పాటు ఇటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ లో చేసేస్తున్నారట.

ఇక అఖండ 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ పనులు కూడా స్టార్ట్ చేసేసారని సమాచారం..ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా తమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయన్నునారు..ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ కీలక పాత్రలో నటించనుంది.. అలాగే యంగ్ హీరో ఆదిపినిశెట్టి ఈ సినిమాలో యంగ్ విలన్ గా నటిస్తున్నాడు.. అఖండ 2 లో ఈ సారి యాక్షన్ సీన్స్ మరింత పీక్స్ లో వుంటాయని సమాచారం.. ప్రత్యేకంగా ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్ నడుస్తుంది..

 

Related posts

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

filmybowl

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!!

murali

Leave a Comment