నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ చరిత్రలో నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు.. ఆయన నటించిన ప్రతీ పాత్ర వెండితెరపై చిరస్థాయిలో నిలిచిపోతుంది.. బాలయ్య ఇన్నేళ్ల తన సినీ కేరీర్ లో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు.. తాను నటించిన ప్రతీ పాత్ర తన అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయేలా బాలయ్య అద్భుతంగా నటించి మెప్పిస్తారు.. ఈ 50 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవలకు అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిద్వారా పేదలకు చేస్తున్న సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.
తండేల్ : అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా.. చందూ మొండేటి షాకింగ్ కామెంట్స్..!!
ఈ సందర్భంగా బాలయ్యకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు నారా వారి కుటుంబ సభ్యులు, తెలుగు సినీ రంగ ప్రముఖులు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలంతా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలా బాబాయ్ అంటూ స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపారు.. ఇదిలా ఉంటే తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో చంద్రబాబునాయుడి సతీమణి అయిన నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు అలాగే బంధువులందరికీ పార్టీ ఇవ్వాలని భావించారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో శనివారం సాయంత్రం పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీలో కేవలం నందమూరి వంశంతోపాటు ఇతర బంధువులు అలాగే కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం హాజరుకాలేదు. ఈ పార్టీ ఏర్పాట్లన్నీ నారా భువనేశ్వరి దగ్గరుండి చూసుకున్నారు. వారికీ ఆమె ఆహ్వానం పంపిందా.. లేదా అనేది తెలియలేదు..నందమూరి కుటుంబ వేడుకలకు వీరిద్దరూ కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు.అయితే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడంతో నందమరి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.