MOVIE NEWS

ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!

నందమూరి నట సింహం బాలకృష్ణ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే బీజిఎం ఓ రేంజ్ లో ఉంటుంది.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది.. ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ కు తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.ఈ సినిమా ప్రదర్శించిన అమెరికా థియేటర్ లో ఏకంగా స్పీకర్స్ బద్దలయ్యాయి అంటే తమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే భారీ విజయం సాధించింది..ఆ సినిమా తరువాత బాలయ్య నటించిన వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సినిమాలకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో బాలయ్య కు వరుస హిట్స్ లభించాయి..

కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..?

ఒకానొక సమయంలో తమన్ మాట్లాడుతూ బాలయ్య సినిమా అంటే పూనకం వచ్చేస్తుంది.. థియేటర్స్ లో స్పీకర్స్ బద్దలైతే నాకు సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు.. ఆ ఒక్క మాటతో తమన్ కి బాలయ్య అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది..అలాగే బాలకృష్ణకు కూడా తమన్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవల ఎన్.బి.కె తమన్ అని నామకరణం చేసీ తనని బాలయ్య తమ కుటుంబంలో ఒకడిగా మార్చేసాడు..

ఇదిలా ఉంటే తాజాగా తమన్ అంటే ఎంత ఇష్టమో బాలయ్య మరోసారి తెలియజేసారు..తనకు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో తమన్ కి ఏకంగా రెండు కోట్లు విలువచేసే కారును బహుమతిగా ఇచ్చాడు.ఆ కారును తీసుకు వెళ్లి తమన్‌కు ఇచ్చి బాలయ్య సర్‌ప్రైజ్‌ చేశారు. అలాగే అక్షింతలు వేసి సంగీత దర్శకుడిగా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

Related posts

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

SSMB : రాజమౌళి రూల్స్ కి వణికిపోతున్న సూపర్ స్టార్..!!

murali

Leave a Comment