MOVIE NEWS

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.. ఈ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించింది.. ఇదిలా ఉంటే బాలయ్య  తన తరువాత సినిమాను మరో యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు..

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవితో “ వాల్తేర్ వీరయ్య “ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన బాబీ డైరెక్షన్ లో బాలయ్య సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాకు “ డాకు మహారాజ్ “ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ మరియు చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్,అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి..

ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు… టైటిల్ టీజర్ లో తమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..ఈ ఈవెంట్ జనవరి 4 న సాయంత్రం 6 గంటలకు అమెరికాలోని టెక్సాస్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేసారు..ఈ ఈవెంట్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Related posts

మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి గారే.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!!

murali

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

murali

రౌడీ కేజీఎఫ్ అంట….

filmybowl

Leave a Comment