MOVIE NEWS

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..?

తెలుగు లో బిగ్ బాస్ రియాలిటి షో కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సరికొత్త గా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ప్రేక్షకులను టీవీ లకు అతుక్కు పోయేలా చేస్తుంది..ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో కి మంచి క్రేజ్ ఉంది.. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలెట్టిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో వరుస సీజన్స్ తో దూసుకుపోతుంది.. ప్రారంభం ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా ఈ షో కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.. బిగ్ బాస్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించారు.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన మొదటి సీజన్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. అద్భుతమైన టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది..కానీ ఆ తరువాత సీజన్ కి ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో చేయడం కుదర్లేదు..

యుగానికి ఒక్కడు : సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. కానీ అదొక్కటే సమస్య..!!

రెండో సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసారు..ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా సామాన్యులకు సైతం అవకాశం ఇవ్వడంతో రెండో సీజన్ కి మరింత క్రేజ్ వచ్చింది.. నాని సైతం హోస్ట్ గా అదరగొట్టాడు.. అయితే మొదటి సీజన్ తో పోలిస్తే టీఆర్పి రేటింగ్ తగ్గడంతో మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహారించారు.. హోస్ట్ గా నాగార్జునకు బాగా అనుభవం ఉండటంతో ఈ షో కి ఆయనే పర్ఫెక్ట్ అని నిర్వాహకులు నమ్మారు..

మూడో సీజన్ మొదలుకొని వరుసగా ఎనిమిదివ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేసారు.. అయితే ఇటీవల చేసిన ఎనిమిడో సీజన్ కి అంతగా ఆదరణ లభించకపోవడం అక్కినేని నాగార్జున వరుస వివాదాలు ఎదుర్కోవడంతో బిగ్ బాస్ షో హోస్ట్ గా తప్పుకోనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. నాగార్జున తప్పుకుంటే ఈ షో కి బాలయ్య హోస్ట్ గా వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు.. ఇప్పటికే బాలయ్య అన్ స్టాప్పబుల్ షో తో దూసుకుపోతున్నాడు.. హోస్ట్ గా బాలయ్య ఎంతగానో అలరిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు బాలయ్యని కలిసినట్లు సమాచారం. అయితే బాలయ్య ఒప్పుకోకుంటే రానా తో హోస్ట్ చేయించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట..

 

Related posts

ది రాజాసాబ్ : మూవీ ఔట్పుట్ పై ప్రభాస్ అసంతృప్తి..!!

murali

స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!

murali

Leave a Comment