MOVIE NEWS

ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ బాగా అవసరం అయింది. నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ నటనలో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో “ఆది”సినిమా ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది.. ఎమోషనల్ సీన్ కానీ, యాక్షన్ సీన్ గానీ ఎన్టీఆర్ అదరగొట్టాడు.. ఆది సంచలన విజయం అందుకోవడంతో ఆది సినిమాను స్వయంగా వీక్షించిన బాలయ్య తారక్ కి ఫోన్ చేసి మరీ అప్రిసియేట్ చేసారు.. అద్భుతంగా నటించావురా తాతగారి పరువు నిలబెట్టావ్ అంటూ ఎన్టీఆర్ ని పొగిడేసారు.. దీనితో అప్పటి నుంచి ఎన్టీఆర్ కి బాలయ్య బాబాయ్ అంటే ఎంతో అభిమానం..

ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఎన్టీఆర్ ఇండస్ట్రీ లో స్టార్ గా ఎదగడంలో బాలయ్య సపోర్ట్ ఎంతో వుంది.. కానీ కొన్నాళ్ళకు బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగింది.. రాజకీయ వివాదాలు అని కొందరు చెప్పుకొచ్చిన వాటిలో ఎలాంటి నిజం లేదు.. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నారు.. బాలయ్య రాజకీయలతో పాటు, సినిమాలలో కూడా రానిస్తున్నారు.. తన తండ్రి హరికృష్ణ అకాల మరణంతో కృంగిపోతున్న ఎన్టీఆర్ ని బాలయ్య ఓదార్చారు.. తన తండ్రి స్థానంలో నిలబడి ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నిలిచారు.. అప్పట్లో బాలయ్య అండగా నిలబడటంతో ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.. దానితో బాబాయ్, అబ్బాయ్ మళ్ళీ కలవడంతో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు..

అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది.. కొన్నాళ్ళుగా బాబాయ్ అబ్బాయ్ కలిసినట్టు లేదు.
అంతేకాదు ఎన్ టీ ఆర్ శతజయంతి ఉత్సవాల్లో కూడా తారక్ కనిపించలేదు . దీనితో బాలయ్య, ఎన్టీఆర్ మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయని వార్తలు వచ్చాయి…తాజాగా బాబాయ్, అబ్బాయ్ మధ్య వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేలా డాకు మహారాజ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.  డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్ టీ ఆర్ ని తీసుకొచ్చే ప్లాన్ జరుగుతుందని తెలుస్తుంది.బాలకృష్ణ పిలిస్తే చాలు తారక్ కచ్చితంగా వచ్చేస్తాడు. దీనితో ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు.. వారిద్దరూ ఒకే వేదికపైకి వస్తే చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. దీనితో ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..

Related posts

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!

murali

రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

filmybowl

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

murali

Leave a Comment