Balagam – A Case Study on 20 Crore Collections in Nizam.
బలగం అనే ఒక చిన్న సినిమా. తీస్తున్నట్టు గాని, రిలీజ్ అయినట్టు గాని ఎవరికీ తెలీదు. రిలీజ్ ఐన రెండు-మూడు రోజుల వరకు ఎవరు మాట్లాడుకోలేదు కానీ దాని తర్వాత ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం నిజంగానే ఒక కేసు స్టడీ.
మౌత్ టాక్ బావుంటే , పబ్లిసిటీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే , మంచి థియేటర్స్ ని హోల్డ్ చేసుకుంటే – మంచి సినిమా కి ఎప్పటికి లాంగ్ రన్ ఉంటుంది అనడానికి బలగం ఒక నిదర్శనం.
Balagam బలగం సినిమా తెలంగాణ సమాజాన్ని, అక్కడ ప్రజల పనులని, పద్ధతులని , ఆచారాల్ని , సాంప్రదాయాలని ప్రతిబింబించే సినిమా. కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు (మున్నా సినిమా లో టిల్లు) ఈ సినిమాని పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించాడు.
Read Also : తలపతి స్టార్ పవర్ నే జనం నమ్మారు – దానికి GOAT కలెక్షన్స్ ఈ సాక్ష్యం
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , మురళీధర్ గౌడ్ , జయరాం , రూప ప్రధాన పాత్రధారులు గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చి. ఈరోజుకి కేవలం నైజాం ఏరియా లోనే ౨౦ కోట్ల రూపాయిల వసూళ్లు చేస్తుంది అంటే దాని వెనుక చిత్రబృందం కష్టం తో పాటు మాస్టర్ మైండ్ దిల్ రాజు పబ్లిసిటీ ని తక్కువ అంచనా వేయకూడదు.
Follow us on Instagram