MOVIE NEWS

బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి బాహుబలి ఫీవర్ ను మళ్లీ ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.గతంలో థియేటర్ లో చూడని వారికి ఇది ఓ విజువల్ ట్రీట్. లెక్క లేనన్ని సార్లు చూసినవాళ్లు పాత జ్ఞాపకాల్లో తేలిపోతారు..

‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..?

అయితే ఈ సినిమా రెండు భాగాలూ కలిపి 5 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది..రీ రిలీజ్ లో మాత్రం రెండు పార్ట్స్‌ను కలిపి సరికొత్త సీన్స్ జోడిస్తున్నారన్న ప్రచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది… గతంలో యూట్యూబ్‌లో విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్‌కు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..దీనితో మేకర్స్ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇతర రీరిలీజ్‌లలా కేవలం పాత ఫార్మాట్‌నే రిపీట్ చేయడం కాకుండా. ఈసారి ఫాన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇవ్వాలని, డిలీట్ చేసిన దృశ్యాలు అలాగే కొత్త విజువల్స్ కూడా జత చేయనున్నట్లు సమాచారం.. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్‌కి నిజంగా పండగనే చెప్పొచ్చు… బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది..పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.. దర్శకులు సైతం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథలను రూపొందిస్తున్నారు..

Related posts

ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!!

murali

అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

murali

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

murali

Leave a Comment