MOVIE NEWS

బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి మూవీ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ అద్భుతమైన కళాఖండాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..?

బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా “బాహుబలి ది ఎపిక్” గా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు. దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి నెలకొంది.అయితే ఈ మూవీ రన్ టైమ్ టైమ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు 4 గంటలు ఉంటుందని మరికొందరు 5 గంటలు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు..బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఈ మూవీలో దాదాపు 80 శాతం కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాహుబలి 1 , 2 రిలీజ్ సమయంలో రన్ టైమ్ సమస్య కారణంగా చాలా సీన్లు తొలగించామని గతంలో రాజమౌళి అన్నారు. వీటన్నింటినీ జోడించి బాహుబలి ఎపిక్ గా మలచనున్నట్లు సమాచారం. అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది..

Related posts

పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?

murali

ENE Repeat : హిలేరియస్ ఫన్ మరొకసారి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..!!

murali

వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..?

murali

Leave a Comment