filmybowl, Author at Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/author/filmybowl/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 28 Oct 2024 16:59:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg filmybowl, Author at Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/author/filmybowl/ 32 32 ఆ హీరో పై త్రివిక్రమ్ కామెంట్స్. https://filmybowl.com/telugu/trivikram-talks-about-that-hero/ https://filmybowl.com/telugu/trivikram-talks-about-that-hero/#respond Mon, 28 Oct 2024 16:59:32 +0000 https://filmybowl.com/telugu/?p=890 Trivikram talks : హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి దర్శకుడు త్రివిక్రమ్‌ తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ “విజయ్‌ దేవరకొండ నాకు చాలా బాగా ఇష్టమైన నటుల్లో ఒకరు. సినిమాల్లోకి వచ్చాక అభిమానుల నుంచి ఎంత ప్రేమను చూసాడో.. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఇంత చిన్న వయసులో , ఇంత...

The post ఆ హీరో పై త్రివిక్రమ్ కామెంట్స్. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Trivikram talks about that hero
Trivikram talks about that hero

Trivikram talks : హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి దర్శకుడు త్రివిక్రమ్‌ తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ “విజయ్‌ దేవరకొండ నాకు చాలా బాగా ఇష్టమైన నటుల్లో ఒకరు. సినిమాల్లోకి వచ్చాక అభిమానుల నుంచి ఎంత ప్రేమను చూసాడో.. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు.

ఇంత చిన్న వయసులో , ఇంత తక్కువ కెరీర్ స్పాన్ లో ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. విజయ్ చాలా గట్టోడు.

బాలగంగాధర్‌ తిలక్‌ రాసిన అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత లో ‘మా వాడే మహా గట్టివాడే’ అని రాశారు. దానికి స్ఫూర్తిగా తీసుకొని చెప్తున్నా
మా విజయ్‌ మహా గట్టోడు, ఏం భయంలేదు. నెస్ట్ సినిమా మీ అంచనాలను అందుకుంటాడు. గట్టి హిట్ కొడతాడు.

ఇక దుల్కర్‌ గురించి చెప్పాలంటే నేను ఆయన్ని పెద్దగా కలవలేదు ఎందుకంటే నాకు షూటింగ్‌ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను. సినిమాల్లో దుల్కర్‌ నటన చూసి అతనితో ప్రేమలో పడిపోయాను. ఇంకా ఇంతకంటే చెప్తే బాగోదు.

ఇండియన్‌ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్‌ క్రియేట్‌ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్‌ మలయాళం సినిమాలో ఒక మైల్‌ స్టోన్‌ దుల్కర్‌ సల్మాన్‌. మమ్ముట్టి లాంటి మహా వృక్షం కింద ఎదగడం అంత సులువు కాదు కానీ దుల్కర్ ఆ పని నీ చాల సమర్ధవంతంగా పూర్తి చేశాడు.

ఇక ఈ సినిమా నిర్మాత, దర్శకులు నాగవంశీ, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి’’ అని కోరుకుంటున్న అన్నాడు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘ ‘నా సోదరుడు దుల్కర్‌ నటించిన లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా రిలేషన్ ఈ రోజుది కాదు మహానటి నుంచి నేను, దుల్కర్ చాల కలిసిపోయాం , చాల మాట్లాడుకునే వాళ్ళం.

పెళ్లిచూపులు సినిమా మంచి విజయం సాధించిన తరువాత నాకు ఫస్ట్‌ చెక్‌ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్‌ నుంచే. త్రివిక్రమ్‌ గారు నన్ను ఆఫీస్‌కి పిలిపించి, కూర్చోబెట్టి మాట్లాడారు, ఫస్ట్‌ చెక్‌ ఇప్పించారు. ఇప్పటికి ఏడేళ్ళు అవుతుంది. చాలారోజులు పట్టింది సినిమా చేయడానికి కానీ ఆ రోజు వంశీ అన్న నన్ను సినిమా చేయమని ఇబ్బంది పెట్టలేదు.

అందుకే అనిపిస్తుంది విజయ్‌ దేవరకొండ12 సితార లో చెయ్యాలని రాసిపెట్టుందేమో. నేను, గౌతమ్‌ త్వరలోనే ఒక మంచి సినిమా తో మీ ముందుకు వస్తాం, మంచి సినిమా తీసుకొస్తాం. ఆరోజు త్రివిక్రమ్‌ గారిని కలవడం నా లైఫ్‌లో ఒక బిగ్‌ మూమెంట్‌.

Also Read :  అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

మన జనరేషన్‌ కి బెస్ట్ ఎంటర్టైనర్ ఫిల్మ్స్ అందించిన దర్శకుడు త్రివిక్రమ్ గారు. మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్‌, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన నన్ను ఆఫీస్‌ లో కూర్చోబెట్టి నువ్వు స్టార్‌ అవుతావు రా చెక్‌ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.

ఆయన నా అభిమాన దర్శకుల్లో ఒకరు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి ఆయన చెప్తుంటే వింటూ కూర్చోవచ్చు’’ అని విజయ్ అన్నారు.

ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్‌ ట్రైలర్స్‌ లో ఒకటి. లక్కీ భాస్కర్‌ తో వెంకీ ఒక కొత్త లెవెల్‌ అన్‌ లాక్‌ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలని , అయిద్దని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి దొరికిందని అర్థమవుతోంది’’ అని చెప్పారు.

Follow us on Instagram

The post ఆ హీరో పై త్రివిక్రమ్ కామెంట్స్. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/trivikram-talks-about-that-hero/feed/ 0
అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్. https://filmybowl.com/telugu/director-ajay-bhupathi-next-confirmed/ https://filmybowl.com/telugu/director-ajay-bhupathi-next-confirmed/#respond Mon, 28 Oct 2024 16:32:27 +0000 https://filmybowl.com/telugu/?p=887 Director Ajay bhupathi next : అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ‘RX 100’ రిలీజై అప్పట్లో ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆ సినిమా పాటలూ, సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియా లో కనిపిస్తూనే వుంటాయి. ఆ తర్వాత వచ్చిన మహాసముద్రం అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా అజయ్ డైరెక్షన్ కి వంక పెట్టలేం. ఇక 2023లో ఆయన పాయల్ రాజపుత్ తో రెండో...

The post అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Director Ajay bhupathi next confirmed
Director Ajay bhupathi next confirmed

Director Ajay bhupathi next : అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ‘RX 100’ రిలీజై అప్పట్లో ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆ సినిమా పాటలూ, సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియా లో కనిపిస్తూనే వుంటాయి. ఆ తర్వాత వచ్చిన మహాసముద్రం అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా అజయ్ డైరెక్షన్ కి వంక పెట్టలేం.

ఇక 2023లో ఆయన పాయల్ రాజపుత్ తో రెండో సారి జత కట్టి తీసిన ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ఏడాది భారత్ తరపున ఆస్కార్‌కి నామినేట్ చేసే సినిమాల జాబితాలో ఈ మూవీని పరిశీలించినా..

ఆ అదృష్టం బాలీవుడ్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్‌’ తన్నుకుపోయింది. కాగా నెక్స్ట్ అజయ్ తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు, ఇక షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి అని అన్నారు ఏమైంది ఏమో కానీ ఇప్పుడు అజయ్ మాత్రం తొందర్లోనే వేరే హీరోతో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ ధృవ్ ప్రాజెక్ట్ ఏమైంది.. ఇంకో హీరో ఎవరంటే..

మంగళవారం లాంటి థ్రిల్లర్ హిట్ తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి.. పెదకాపు ఫేమ్ హీరో విరాట్ కర్ణ తో ఒక రగ్డ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా షూట్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Also Read :  మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా

అయితే తమిళ్ యంగ్ సెన్సేషన్ ధృవ్ విక్రమ్ తో ఒక బైలింగ్వల్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో నిజమున్న.. మూవీ ఆగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎంతో ఎక్సైట్ అయినా ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త డీలా పడ్డారు. అయితే విరాట్ కర్ణతో చేస్తున్న ప్రాజెక్ట్‌తో అజయ్ మళ్ళీ ఎం మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.

మరోవైపు పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో బోల్డ్ కథాంశంతో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’. అన్ని వర్గాల ప్రేక్షకులని, విమర్శకులని, తెలుగు పరిశ్రమ దిగ్గజాలని కూడా ఆకట్టుకుని థియేటర్లలో మంచి విజయంతో కంటెంట్ ఉన్న చిత్రాల బలం చూపించింది ఈ చిత్రం. జాతీయ, అంతర్జాతీయ వీక్షకుల నుండి ఓటీటీలో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.

Follow us on Instagram

The post అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/director-ajay-bhupathi-next-confirmed/feed/ 0
మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా https://filmybowl.com/telugu/sai-durga-tej-this-time-coming-up-with-pan-india-film/ https://filmybowl.com/telugu/sai-durga-tej-this-time-coming-up-with-pan-india-film/#respond Mon, 28 Oct 2024 16:14:54 +0000 https://filmybowl.com/telugu/?p=884 Sai Durga Tej film : సాయి దుర్గ్ తేజ్ కెరీర్లోనే బిగ్టెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం విరూపాక్ష. హార్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం చాలా మాంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు గా వంద కోట్లు కలెక్ట్ చేసి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కానీ ఆ సినిమాని పాన్ ఇండియా కి తీసుకెళ్ళలేదు. అందుకే ఇప్పుడు తేజు మళ్లీ...

The post మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Sai Durga Tej This time coming up with pan india film
Sai Durga Tej This time coming up with pan india film

Sai Durga Tej film : సాయి దుర్గ్ తేజ్ కెరీర్లోనే బిగ్టెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం విరూపాక్ష. హార్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం చాలా మాంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు గా వంద కోట్లు కలెక్ట్ చేసి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కానీ ఆ సినిమాని పాన్ ఇండియా కి తీసుకెళ్ళలేదు. అందుకే ఇప్పుడు తేజు మళ్లీ ఓ అలాంటి ఒక భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ జానర్ కి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వుండడం తొ ఈ సారి ఎత్తి పరిస్థితుల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం మొదటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి తగ్గట్టు గానే అడుగులు వేస్తుంది.

రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడునీ పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రూపొందిస్తుండడం విశేషం. ఈ మూవీ బడ్జెట్ కూడా వంద కోట్లను దాటుతుంది అంటున్నారు.

ఈ ఏడాది ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా తో చేసిన
హనుమాన్’ సినిమా తో భారీ విజయాన్నందుకున్న ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రానికి పని చేస్తున్న టెక్నికల్ టీం కూడా పేరున్న వాళ్లనే తీసుకుంటున్నారు. కంగువ సహా పలు భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి ఈ చిత్రానికి పని చేస్తున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంగీత దర్శకుడునీ కూడా ఖరారు చేసింది. కన్నడలో ఇప్పుడు రవి బర్సూర్ తో పాటుగా అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌ను తేజు సినిమా కోసం మరో సారి తీసుకున్నారు.

Also Read : సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

‘విరూపాక్ష’కు కూడా అజనీషే సంగీత దర్శకుడు ఆ సినిమా లో పాటలు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు అజనీష్. దీని కంటే ముందు అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ‘మంగళవారం’ సినిమాకు కూడా మ్యూజిక్ చేశాడు. ఆ సినిమా నేపథ్య సంగీతానికి కూడా చాలా మంచి ప్రశంసలు దక్కాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు తన మ్యూజిక్ బాగా సెట్ అవుతుంది.

తేజు ప్రస్తుతం చేస్తున్నది చారిత్రక నేపథ్యం ఉన్న థ్రిల్లర్ మూవీ. అజనీష్ మరోసారి తేజు సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తాడు అనడం లో సందేహం లేదు. ఇందులో తేజు నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. వచ్చే ఏఢాది వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయాల్సి ఉంది

Follow us on Instagram 

The post మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sai-durga-tej-this-time-coming-up-with-pan-india-film/feed/ 0
సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ?? https://filmybowl.com/telugu/megastar-chiranjeevi-coming-up-with-social-message-film/ https://filmybowl.com/telugu/megastar-chiranjeevi-coming-up-with-social-message-film/#respond Mon, 28 Oct 2024 16:02:05 +0000 https://filmybowl.com/telugu/?p=881 Megastar Chiranjeevi message film : అతనొక స్టార్ హీరో. డైలాగ్స్ తో మెప్పించగలడు, డ్యాన్స్ తో మెస్మిరైజ్ చేయగలడు, కామెడీ తో నవ్వించను గలడు. అదే టైం లో సమాజం కోసం మంచి చెప్పగలడు. ఐతే ఈ సారి ఆ చివరిది చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరా హీరో, ఎంటా కథా అనుకుంటున్నారా. సరే చదవండి ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత చిరంజీవి చేయబోయే చిత్రం ఏది? ఎవ‌రితో అనే విష‌యంలో...

The post సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ?? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Megastar Chiranjeevi coming up with social message film
Megastar Chiranjeevi coming up with social message film

Megastar Chiranjeevi message film : అతనొక స్టార్ హీరో. డైలాగ్స్ తో మెప్పించగలడు, డ్యాన్స్ తో మెస్మిరైజ్ చేయగలడు, కామెడీ తో నవ్వించను గలడు. అదే టైం లో సమాజం కోసం మంచి చెప్పగలడు. ఐతే ఈ సారి ఆ చివరిది చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరా హీరో, ఎంటా కథా అనుకుంటున్నారా. సరే చదవండి

‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత చిరంజీవి చేయబోయే చిత్రం ఏది? ఎవ‌రితో అనే విష‌యంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ‘విశ్వంభ‌ర‌’ ముందు చెప్పిన డేట్ అయిన సంక్రాంతికి వచ్చి వుంటే, ఈపాటికి చిరు తన త‌దుప‌రి సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చేది.

కానీ తనయుడు చరణ్ సినిమా కోసం చిరు జ‌న‌వ‌రి నుంచి వేస‌వికి వాయిదా వేసుకోడంతో, చిరు ఇప్పుడు కాస్త రిలాక్డ్స్ గానే ఉన్నారు కొత్త కథలు వినాలని చూస్తున్నారు. ఈలోగా ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. చిరంజీవి నుంచి ఓ గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకొని, సినిమా మొద‌లెట్టాల‌న్న ఆత్రుతగా ఉన్నారు.

ర‌చ‌యిత బీవీఎస్ ర‌వి కూడా చిరంజీవికి ఓ క‌థ చెప్పారట. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న కాదు. చిరు నీ గాడ్ ఫాదర్ గా ఛూయించిన మోహ‌న్ రాజాతో క‌లిసి ఆయ‌న వ‌ర్క్ చేస్తున్నారు. క‌థ దాదాపుగా తయారయింది.

చిరు సరే అన్నాడంటే ఇక స్టార్ట్ కెమెరా అనడమే. ఈ కథ బీవీఎస్ ర‌వి ఓ సామాజిక సందేశం నిండిన క‌థ రాశార‌ట‌. ‘ఠాగూర్‌’ త‌ర‌హా సినిమా అని, బ‌ల‌మైన సోషల్ మెసేజీతో పాటు, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ అద్దారని స‌మాచారం.

Also Read : గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

ఇదే విష‌యంపై ర‌వి కూడా ఓ మాట అన్నారు. చిరంజీవి అంటే ఎప్పుడు పాట‌లు డాన్సులు గుర్తొస్తాయ‌ని, అలాంటి సినిమాలు ఆయ‌న ఎన్నో చేశార‌ని, ఓ పెద్ద స్టార్ బ‌ల‌మైన సందేశాన్ని ఇస్తే, చాలామందికి దగ్గర అవుతుంద‌ని, ఇప్పుడు అలాంటి క‌థే సిద్ధం చేశాన‌ని చెప్పుకొచ్చారు బీవీఎస్ ర‌వి. ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత త‌మ సినిమానే మొద‌ల‌వుతుంద‌ని కూడా డిక్లేర్ చేశారు.

అయితే… చిరు టీం మాత్రం ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత ఏ సినిమా చేయాల‌న్న విష‌యంలో చిరు ఇంకా ఓ నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెబుతున్నారు. బీవీఎస్ ర‌వి క‌థ కూడా ఆప్షన్ లో పెట్టుకున్నారని చెప్పారు, అయితే చిరు ఆమోద ముద్ర వేయాల‌ని అంటున్నారు.

Follow us on Instagram 

The post సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ?? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/megastar-chiranjeevi-coming-up-with-social-message-film/feed/ 0
గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే https://filmybowl.com/telugu/its-time-for-game-changer-teaser/ https://filmybowl.com/telugu/its-time-for-game-changer-teaser/#respond Sun, 27 Oct 2024 15:47:20 +0000 https://filmybowl.com/telugu/?p=877 Game Changer Teaser : ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, చరణ్ లకు పాన్ ఇండియా స్టార్లుగా మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపు దేవర సినిమా ఎప్పుడు ఎన్టీఆర్ విషయం లో భాగా కనపడింది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ వంతు రావడం తో అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. చరణ్ అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ గురించే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫ్యాన్స్ అంతా...

The post గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
It's time for Game Changer Teaser
It’s time for Game Changer Teaser

Game Changer Teaser : ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, చరణ్ లకు పాన్ ఇండియా స్టార్లుగా మంచి గుర్తింపు లభించింది.

ఆ గుర్తింపు దేవర సినిమా ఎప్పుడు ఎన్టీఆర్ విషయం లో భాగా కనపడింది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ వంతు రావడం తో అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు.

చరణ్ అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ గురించే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వల్ల పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల అవుతుందనే వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మూవీ విడుదలకు ఇంకా టైమ్ ఉన్నా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు.

దసరా సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ ప్రకటించి ఫ్యాన్స్ కి ఒక ఊరటనిచ్చారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుందని కొత్త పోస్టర్‌తో విడుదల చేశారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పుడు దీపావళి కానుకగా టీజర్ విడుదల కానుంది అని తాజాగా ఒక కొత్త పోస్టర్‌తో ఈ టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక అప్డేట్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆ టీజర్ ఎలా ఉంటుందా అని ఎవరి కథలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు

గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకి ఇంకా 75 రోజులు సమయం ఉందని రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ మొహం కనిపించకుండా బ్యాక్ షాట్ లో పోస్ నీ చిత్ర బృందం బయటకి వదిలింది.

Also Read : బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ సినిమా లో చరణ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడనే విషయంల తెలిసిందే. అదే ఈ పోస్టర్‌లో స్పష్టమవుతోంది. ఎంతమంది అడ్డొచ్చిన న్యాయంగా పనిచేసే ఉద్యోగిగా ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్‌తో చెప్పకనే చెప్పాడు దర్శక దిగ్గజం శంకర్.

పటాసులు పేలనున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్‌ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించింది. సునీల్, శ్రీకాంత్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏస్ ఏస్ తమన్ సంగీతం సమకూర్చాడు. వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నీ నిర్మించారు.

Follow us on Instagram 

The post గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/its-time-for-game-changer-teaser/feed/ 0
బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి https://filmybowl.com/telugu/nandamuri-balakrishna-wishes-turned-reality/ https://filmybowl.com/telugu/nandamuri-balakrishna-wishes-turned-reality/#respond Sun, 27 Oct 2024 15:06:19 +0000 https://filmybowl.com/telugu/?p=874 Nandamuri Balakrishna Wishes : ముఖ్యమంత్రి కి కొడుకు గా ముఖ్యమంత్రి కి బావ మరిది గా సెంట్రల్ మినిస్టర్ కి తమ్ముడి గా న‌టుడిగా ప్ర‌జా ప్ర‌తినిధి గా బాలయ్య నిజ జీవితం లో కూడా ఎన్నో బిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తున్నారు కానీ ఏనాడు వాటిని వాడుకొని తాను అక్రమార్జన చేసింది లేదు. ఉన్నది ప్రజలకి పంచడం తప్ప పక్కనోడి రూపాయి మీద ఆశ లేనోడు బాలయ్య ఒక...

The post బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Nandamuri Balakrishna Wishes Turned Reality
Nandamuri Balakrishna Wishes Turned Reality

Nandamuri Balakrishna Wishes :

ముఖ్యమంత్రి కి కొడుకు గా
ముఖ్యమంత్రి కి బావ మరిది గా
సెంట్రల్ మినిస్టర్ కి తమ్ముడి గా
న‌టుడిగా
ప్ర‌జా ప్ర‌తినిధి గా

బాలయ్య నిజ జీవితం లో కూడా ఎన్నో బిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తున్నారు కానీ ఏనాడు వాటిని వాడుకొని తాను అక్రమార్జన చేసింది లేదు.

ఉన్నది ప్రజలకి పంచడం తప్ప పక్కనోడి రూపాయి మీద ఆశ లేనోడు బాలయ్య

ఒక పక్క నటుడి గా అలరిస్తూ , ఎంఎల్ఏ గా తన హిందూపురం ప్రజలు కోసం ఎప్పుడు నిలబడతాడు, పార్టీ కి కష్టం వస్తే అందరి కంటే ముందు ముందుకొచ్చి నిలబడేది , కార్యకర్తలకు ధైర్యం చెప్పేది బాలయ్యే. మ‌రోవైపు బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రికి సంబంధించిన ప‌నులు కూడా ద‌గ్గ‌రుండి చ‌క్క‌బెడుతుంటారు. అన్‌స్టాప‌బుల్ లాంటి షోలు స‌రే స‌రి.

బాలయ్య కు ఎప్ప‌టి నుంచో ఒక ఫిల్మ్
స్టూడియో కట్టాలన్నది ఆశ‌. చాలాకాలంగా ఈ విష‌య‌మై ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్ప‌ట్లో ఏపీలో బాల‌య్య స్టూడియో క‌ట్టుకోవ‌డానికి త‌గిన స్థ‌లం కూడా కేటాయించార‌న్న వార్త‌లొచ్చాయి. అయితే మ‌ధ్య‌లో ఆంధ్ర లో వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ ప్ర‌తిపాద‌న‌లు ప‌క్క‌న పెట్టేశారు.

అయితే ఈసారి బాల‌య్య‌కు తెలంగాణ‌లో స్టూడియో క‌ట్టుకోవ‌డానికి అనుకూలంగా ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పందన రాబోతున్నట్లు తెలుస్తుంది. బాల‌కృష్ణ స్టూడియో కోసం రెవిన్యూ శాఖ ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్టు, దానికి అనువైన స్థ‌లం కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ విష‌యం బ‌య‌ట‌కు రానుంది.

నిజానికి ఇప్పుడు ఏపీలో తెలుగు దేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. బాల‌య్య గట్టిగా కావాలనుకుంటే అక్కడే అడగచ్చు, ఏపీలో స్టూడియోకి త‌గిన స్థ‌లం అడిగితే ప్ర‌భుత్వం కేటాయిస్తుంది. ఇందులో అనుమానం ఏం లేదు.

Also Read : ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

కానీ అలా స్టూడియో కోసం బాల‌య్య స్థ‌లం ద‌క్కించుకొంటే, విప‌క్షం నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సొంత మ‌నుషుల‌కు స్థ‌లాలు ఇచ్చుకొంటూ పోతారా? అంటూ పార్టీ మీద, ప్రభుత్వం మీద నిందలు మోపడానికి అక్కడ వేరే పార్టీ రెడీ గా వుంటది. అందుకే తన వల్ల పార్టీ కి ఇబ్బంది కలగకుడదు అని ఇప్పుడు తెలంగాణలో స్టూడియో నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపించార‌ని అర్థ‌మ‌వుతోంది.

దానితో పాటు బ‌స‌వ‌తార‌కం ఆసుపత్రిని ఏపీలో నిర్మించాల‌న్న‌ది ఆయ‌న కోరిక త్వ‌ర‌లోనే అందుకు త‌గిన అనుమ‌తులు, స్థ‌లం కూడా బాల‌య్య‌కు మంజూర‌య్యే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

ఏపీలో బ‌స‌వ‌తారం ఆసుపత్రి, తెలంగాణ‌లో ఫిల్మ్ స్టూడియో.. ఇవి రెండూ బాల‌య్య చిర‌కాల కోరిక‌లు. ఇవి ఇప్ప‌టికి నెర‌వేరుతున్నాయి. త్వరగా వాటిని కట్టేసి వాడుక లో తీసుకురావాలని అందరం కోరుకుందాం.

Follow us on Instagram 

The post బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nandamuri-balakrishna-wishes-turned-reality/feed/ 0
ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్ https://filmybowl.com/telugu/prabhas-fans-get-ready-for-thriple-dhamakha/ https://filmybowl.com/telugu/prabhas-fans-get-ready-for-thriple-dhamakha/#respond Sun, 27 Oct 2024 14:49:33 +0000 https://filmybowl.com/telugu/?p=852 Prabhas Fans Thriple Dhamakha : పాన్ ఇండియా మెగా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హర్రర్ కామెడీ మూవీ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. పాన్ ఇండియా రేంజ్ కి చేరుకున్నాక సాధారణంగా మాస్, యాక్షన్ జోనర్‌లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రభాస్.. ఈసారి హర్రర్ టచ్‌తో కామెడీ జోనర్‌లో అందరినీ భయపెడుతూ నవ్వించడానికి సిద్ధమవుతున్నారు....

The post ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Prabhas Fans Get Ready for Thriple Dhamakha..
Prabhas Fans Get Ready for Thriple Dhamakha..

Prabhas Fans Thriple Dhamakha : పాన్ ఇండియా మెగా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హర్రర్ కామెడీ మూవీ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. పాన్ ఇండియా రేంజ్ కి చేరుకున్నాక సాధారణంగా మాస్, యాక్షన్ జోనర్‌లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రభాస్.. ఈసారి హర్రర్ టచ్‌తో కామెడీ జోనర్‌లో అందరినీ భయపెడుతూ నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అభిమానులకి భాగా నచ్చేశాయి, టీజర్లు సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంపురస్కరించుకొని అక్టోబర్ 23న విడుదలైన మోషన్ పోస్టర్ అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్, ఊహించని విధంగా రాజవారిగా ఒక వృద్ధుడి గెటప్‌లో కనిపించడంతో, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా, ప్రభాస్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తూ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారనే టాక్ ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆయన మూడు భిన్న గెటప్స్‌లో దర్శనమివ్వబోతున్నారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో కంప్లీట్ గా రాజ్ సాబ్ రాజ్యం హైలెట్ అవుతుందట.

ఇక ప్రస్తుత కాలంలో స్టైలిష్ యంగ్ రెబల్ స్టార్ దర్శనమివ్వనున్నాడు. తాత మనవళ్ళుగా ప్రభాస్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక రాజా సాబ్ ఆత్మ గెటప్ లో ప్రభాస్ లుక్ నిన్న విడుదల చేసిందే. సెకండ్ హాఫ్ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దర్శకుడు మారుతి తనదైన శైలిలో హర్రర్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా స్క్రిప్ట్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రిల్ 2025లో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read :  బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

యస్ యస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నారని వస్తున్న టాక్ అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి డార్లింగ్ ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Follow us on Instagram 

The post ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-fans-get-ready-for-thriple-dhamakha/feed/ 0
బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..! https://filmybowl.com/telugu/krithi-shetty-hopes-on-that-film/ https://filmybowl.com/telugu/krithi-shetty-hopes-on-that-film/#respond Fri, 25 Oct 2024 07:25:41 +0000 https://filmybowl.com/telugu/?p=846 Krithi Shetty : ఉప్పెన లాంటి క్రేజీ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో 100 కోట్ల హిట్ అందుకున్న హీరోయిన్ గా బేబమ్మ అలియాస్ కృతి శెట్టికి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే వరుసగా యువ హీరోలందరి సినిమాల్లో ఛాన్స్ లు కూడా దక్కించుకుంది. ఐతే కృతి కి లక్ మాత్రం కలిసి రాలేదు. చేసిన ప్రతి సినిమా కూడా ఆమెను నిరాశ పరిచాయి....

The post బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Krithi Shetty hopes on that film
Krithi Shetty hopes on that film

Krithi Shetty : ఉప్పెన లాంటి క్రేజీ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో 100 కోట్ల హిట్ అందుకున్న హీరోయిన్ గా బేబమ్మ అలియాస్ కృతి శెట్టికి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే వరుసగా యువ హీరోలందరి సినిమాల్లో ఛాన్స్ లు కూడా దక్కించుకుంది.

ఐతే కృతి కి లక్ మాత్రం కలిసి రాలేదు. చేసిన ప్రతి సినిమా కూడా ఆమెను నిరాశ పరిచాయి. దాంతో ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్లిన కృతి అందరి మధ్య ఎలా ఐతే చర్చగా మారిందో అంతే త్వరగా ఫాం కోల్పోయింది. వరుస యువ హీరోలందరితో కలిసి సినిమాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్టు లేక కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి.

ఇక దాంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి జంకారు నిర్మాతలు. ఇక ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదని గ్రహించి పక్కనే ఉన్న కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. జయం రవితో , ప్రదీప్ రంగనాథ్ తో సినిమా ఆఫర్లు అందుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్ తో LIK సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో తమిళ్ ఇండస్ట్రీ లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది.ఎందుకంటే తమిళం లో క్లిక్ ఐతే మళ్ళీ తెలుగు నుంచి ఆఫర్లు వస్తాయని అమ్మడు గట్టి నమ్మకం.

ఇవే కాకుండా సినిమాలతో పాటు ఈమధ్య ఫోటో షూట్స్ తో కూడా కృతి కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తుంది. స్లీవ్ లెస్ ఫోటో షూట్స్ తో మళ్ళీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

Also Read : పొట్టేల్ సినిమా రివ్యూ

తెలుగు సినిమా తొలి ఆఫర్ ఇచ్చి 100 కోట్ల సినిమా ఇచ్చినా కథల ఎంపికలో తెలివిని ప్రదర్శించలేని అమ్మడు త్వరగానే తన ఫాం కోల్పోయేలా చేసుకుంది. ఐతే టాలీవుడ్ పక్కన పెట్టి ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా కోలీవుడ్ మీద పెట్టింది బేబమ్మ. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుండగా ఒక్క హిట్ పడినా సరే తన మకాం ని తమిళ పరిశ్రమకు మార్చాలని చూస్తుంది అమ్మడు.

ఈమధ్యనే మలయాళంలో కూడా టోవినో థామస్ తో ఒక సినిమా చేసింది కృతి శెట్టి. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు పెట్టుకోగా మలయాళంలో సోసోగా ఆడిన ఆ మూవీని తెలుగు, తమిళ ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. మరి తెలుగు లో ఎలాగు ఛాన్సులు లేవని తమిళ, మలయాళంలో గట్టి ప్రయత్నాలు చేస్తున్న కృతి శెట్టికి అక్కడైనా సరైన ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.

Follow us on Instagram 

The post బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/krithi-shetty-hopes-on-that-film/feed/ 0
పొట్టేల్ సినిమా రివ్యూ https://filmybowl.com/telugu/pottel-movie-full-review/ https://filmybowl.com/telugu/pottel-movie-full-review/#respond Fri, 25 Oct 2024 07:12:29 +0000 https://filmybowl.com/telugu/?p=843 Pottel Movie Full Review :  నటీనటులు: యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకుడు: సాహిత్ మోత్కూరి నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి – సురేష్ కుమార్ సాదిగ సంగీతం: శేఖర్ చంద్ర కెమెరా: మోనిష్ భూపతిరాజు Release Date : అక్టోబర్ 25, 2024 ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ హిట్స్ చిన్న సినిమాలకే చూస్తుంది. గత మూడు, నాలుగు...

The post పొట్టేల్ సినిమా రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Pottel Movie Full Review
Pottel Movie Full Review

Pottel Movie Full Review : 

నటీనటులు: యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్
దర్శకుడు: సాహిత్ మోత్కూరి
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి – సురేష్ కుమార్ సాదిగ
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా: మోనిష్ భూపతిరాజు
Release Date : అక్టోబర్ 25, 2024

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ హిట్స్ చిన్న సినిమాలకే చూస్తుంది. గత మూడు, నాలుగు నెలలు గా చిన్న సినిమాలన్నీ దాదాపుగా లాభాలని తెచ్చి పెడుతున్నాయి అదే ఇంకో చిన్న సినిమా రిలీజ్ కి రెడీ అయింది.

చిన్న సినిమాలు వచ్చి హిట్ కొట్టడం చాలనే చూశాం కానీ ఈ మధ్య కాలం లో ఓ చిన్న సినిమాకి విపరీతమైన బజ్ రావడం బహుశా “పొట్టేల్” సినిమా కి మాత్రమే దక్కిన అదృష్టమే అని చెప్పాలి.

సినిమా కి ఎంచుకున్న ప్రమోషనల్ కంటెంట్ కానీ, ప్రెస్ మీట్ లో అడిగిన ఒక కాంట్రెవర్సియల్ హడావుడి వల్ల కానీ సినిమా అందరికీ ఈజీ గా రీచ్ అయ్యింది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల అవుతుండగా.. సినిమా మీద ఎంతో నమ్మకం తొ రెండ్రోజుల ముందే మీడియా కోసం ప్రీమియర్స్ వేశారు దర్శకనిర్మాతలు. మరి “పొట్టేల్” చిత్రం ఆ నమ్మకాన్ని ఎంత మేరకు నిలబెట్టుకుందో తెలుసుకుందామా…. ఐతే రివ్యూ చదవండి

కథ: ఇది రాష్ట్ర విభజన ముందు కథ. ఇప్పటి తెలంగాణ రాష్ట్రం లో, నాస్తి ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయక ముందు తెలంగాణ ప్రాంతంలోని గుర్రంగట్టు అనే ఓ కుగ్రామం లో జరిగిన కథ ఈ “పొట్టేల్”.

బాలమ్మ పొట్టేల్ కు కాపరుడైన గంగాధర్ (యువ చంద్ర) ఊరికి పెద్ద అయిన పటేల్ (అజయ్) ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకొని వీరిని రక్షించుకోవాలని చూస్తుంటాడు. అయితే.. ఊరంతా పటేల్ వ్యవస్థను గుడ్డిగా నమ్మి గంగ ఎంతగా మొత్తుకుంటున్నా ఆ మాటలని ఎవరు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుంటారు.

పటేల్ వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో తెలియచేస్తూ దాని నుండి బయటకు రమ్మని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపునిచ్చిన తర్వాత కూడా పటేల్ గుర్రంగట్టు ప్రజలందరి పై మూఢ నమ్మకం ముసుగులో అందరినీ భయపెడుతూ అధికారం చలాయిస్తూనే ఉంటాడు.

తాను చదువుకోలేకపోయాడు కాబట్టే తన మాట, తాను నిజం చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని.. కనీసం తన బిడ్డ సరస్వతినైనా చదివించాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు గంగ.

ఆ సంకల్పం తో ముందుకెళ్తున్న గంగ కి ఆ ఊరి లో, ఆ ఊరి పెద్ద వల్ల ఎదురైన సమస్యలు ఏమిటి? గంగ ఆశలను పటేల్ ఎలా తొక్కిపెట్టాడు? గుర్రంగట్టు ప్రజలు పటేల్ ఆడుతున్న ఆటను ఎప్పటికీ అర్థం చేసుకున్నారు. ఆ దుర్మార్గుడి నుండి ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానo ఇస్తూ సాగిపోతుంది“పొట్టేల్” చిత్రం.

నటీనటుల పనితీరు: అజయ్ కి చాల పోటేంషియల్ ఉంది. నటుడిగా ఎన్నో మంచి పాత్రలు వేశాడు. కానీ ఇది అజయ్ మాత్రమే చేయాల్సిన పాత్ర అనేతువంటిది ఇప్పటి వరకు పడలేదు. ఆ లోటు నీ పొట్టెల్ తీర్చేసింది అనే చెప్పాలి. ఒక మంచి నటుడికి ఆసక్తికరమైన పాత్ర ఇస్తే ఏస్థాయిలో జీవిస్తాడు అనేందుకు పటేల్ పాత్రలో అజయ్ ఒదిగిపోయిన విధానం ఉదాహరణగా చెప్పచ్చు.

ఈ మాట అంటే ఆస్థ అతి గా వుండచ్చు గాని “లెజెండ్”లో జగపతిబాబు, “విక్రమ్”లో విజయ్ సేతుపతిల తర్వాత ఆ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దారు విలన్ క్యారెక్టర్నీ “పొట్టేల్” సినిమాలో.

పాత్ర పుట్టుక నుంచి ఆ పాత్ర ఎందుకు అలా వ్యవహరిస్తుంది, దానికి కారణం ఏమిటి? వంటి విషయాలు దర్శకుడు చాల నేర్పుతో, ఓర్పుతో రాసుకున్నాడు, ఆ రాత లో ఎంత కష్టపడ్డాడో , తీత లో కూడా దర్శకుడు తన ప్రతిభ నీ చించాడు.

అలాగే దర్శకుడి కష్టాన్ని అర్థం చేసుకొని అజయ్ పటేల్ పాత్ర నీ తెరపై పండించిన తీరు అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం అనే చెప్పుకోవాలి. అజయ్ లాంటి నటుడ్ని మన దర్శకులు సరిగా వినియోగించుకోకుండా పరభాషా నటులను అనవసరంగా పోషిస్తున్నారు అని సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అనిపించక మానదు.

ఇప్పటికే “మత్తు వదలరా 2, దేవర” సినిమాతో మంచి ఊపు లో ఉన్న అజయ్ కి “పొట్టేల్” ఎన్నాళ్ల నుండో రాకుండా ఉండిపోయిన గుర్తింపును తీసుకొస్తుందిప్.

ఇక హీరో పాత్రలో చేసిన యువ చంద్ర నటన చాల శ్రద్ధ గా చేశాడు. పాత్ర కోసం తనను తాను మార్చుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా కూతురు చదువు కోసం దేనికైనా తెగించే తండ్రిగా అతడి నటన చాలా సహజంగా ఉంది. అందరికీ చెరువవుతుంది అనడంలో సందేహం లేదు.

అనన్య మరోసారి చాల సహజమైన పాత్రలో మంచి నటనతో ఆకట్టుకుంది. ఆమె కట్టు బొట్టు, ఆ ముఖంలోని అమాయకత్వం బుజ్జమ్మ పాత్రకు ప్లస్ అయ్యాయి. అనన్య చెప్పినట్టు బహుశా తెలుగు ప్రేక్షకుడికి ఈమె బుజ్జమ్మ గానే గుర్తుండిపోతుంది అన్నట్టు ఈ పాత్ర తాను చేసింది.

టీచర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్, ఊరి మనిషి పాత్రలో నోయల్ చక్కని నటనతో ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యం గా చెప్పుకోవాల్సింది సరస్వతిగా నటించిన పాప తన్వి శ్రీ, పెద్ద పెద్ద కళ్లతో భయాన్ని, బాధని ఇంత చిన్న వయసులోనే తాను పండించిన తీరు అభినందనీయం.

సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమా మూడ్ నీ రిఫలెక్ట్ చేస్తూ సన్నివేశానికి ఎంత మేరకు కావాలో సరిగ్గా తూకం వేసి మరి ఇచ్చాడు. ఇక సినిమా లోని పాటలన్నీ ఎక్కేస్తాయి. నేపథ్య సంగీతమైతే.. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. సినిమా నీ ఒక ఎత్తులో నిలబెట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రీ-రికార్డింగ్ & వోకల్స్ తారా స్థాయిలో ఉన్నాయి. శేఖర్ చంద్ర కెరీర్ కి ఈ సినిమా ఓ పెద్ద మైలురాయిగా నిలుస్తుంది.

Also Read : మెగా సీజన్ స్టార్ట్స్

కెమెరామెన్ మోనిష్ భూపతిరాజు వర్క్ కూడా ఈ సినిమాకి కీలకమే. ప్రీక్లైమాక్స్ లో ఒక సన్నివేశం లో తన సత్తా చాటాడు. అలాగే.. సినిమా లోని ప్రతి సన్నివేశంలో ఎమోషన్ కు తగ్గట్లుగా వినియోగించిన లైటింగ్ & ఫ్రేమింగ్ ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి.

ఈ సినిమా కి టెక్నికల్ టీం వర్క్ ప్రాణం పోసింది.. ఈ కథ 1950 నుండి1990 దశకం లో జరిగేదే అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి వేరే ఆలోచన రాకుండా తీశారు. ఏ మాత్రం ప్రేక్షకుడికి వేరే ఆలోచన రానీయకుండా వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు సూపర్ అనే చెప్పాలి.అదే విధంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ నీ మెచ్చుకోవాల్సిందే

నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా భారీగానే ఖర్చు చేశారు దానికి తగా ఫలితం కూడా అందుకోనున్నారు. దర్శకుడి విజన్ కు ఎంతలా సపోర్ట్ ఇచ్చారో ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఓ దర్శకుడికి రెండో చిత్రానికి ఇలాంటి నిర్మాతలు దొరకడం అంటే దర్శకుడు ఒక రకంగా అదృష్టం చేసుకున్నాడని చెప్పుకోవాలి.

దర్శకుడు సాహిత్ మోత్కూరి తొలి సినిమా “సవారి” (2020). ఆ సినిమా అంతగా అలరించకపోయినా ఆ అపజయం తాలూకు కసి “పొట్టేల్” సినిమా రైటింగ్ లో కనిపిస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్, పాత్రల తీరుతెన్నులు, క్యారెక్టర్ ఆర్క్స్ రాసుకున్న విధానం అబ్బురపరిచింది.

Read Also :  ఇట్స్ మీనాక్షి టైం

ముఖ్యంగా ఓ స్వార్థపరుడు దైవాన్ని, మూఢ నమ్మకాల్ని తనకు కావాల్సినట్లుగా వాడుకొని అమాయకులైన ప్రజలను ఎలా గొర్రెల మందలా మార్చి తన చుట్టూ తిప్పుకున్నాడు అనే అంశాన్ని రాసుకున్న విధానం ఆశ్చర్యపరుస్తుంది. మొత్తం మీద సాహిత్ కి దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు వేస్తారు ప్రేక్షకులు అని చెప్పాలి.

విశ్లేషణ: చదువు అనేది ఎంత ముఖ్యమో అది ఒక మనిషిని కాదు మొత్తం సమాజాన్ని, వ్యవస్థను తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని “పొట్టేల్” సినిమా ద్వారా మరో సారి తెలియజెప్పడం అనేది అభినందనీయం.

చివరగా పొట్టేల్: అందరికీ నచ్చే మాంచి సినిమా.

Filmy Bowl Movie Rating: 3/5

Follow us on Instagram 

The post పొట్టేల్ సినిమా రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pottel-movie-full-review/feed/ 0
మెగా సీజన్ స్టార్ట్స్ https://filmybowl.com/telugu/tollywood-to-witness-the-mega-season-from-november/ https://filmybowl.com/telugu/tollywood-to-witness-the-mega-season-from-november/#respond Thu, 24 Oct 2024 06:02:15 +0000 https://filmybowl.com/telugu/?p=839 Tollywood Mega Season : ఇదేంటీ కొత్తగా మెగా సీజన్ అనుకుంటున్నారా. ఇండస్ట్రీ లో బడా సినిమాలకి ఎప్పుడు కొదవ లేదు పైగా ఈ మధ్య బాహుబలి పుణ్యమా అని అన్నీ ఇండస్ట్రీస్ కలిసిపోయాయి. ఏ ఇండస్ట్రీ లో పెద్ద సినిమా వచ్చినా అందరు చూసేస్తున్నారు. సో కొత్తగా మళ్ళీ మెగా సీజన్ ఎంటా అనుకుంటున్నారా…. సరే చదవండి ఐతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ముఖ్యంగా కుటుంబాల హవా...

The post మెగా సీజన్ స్టార్ట్స్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu
Tollywood to Witness the mega season from November

Tollywood Mega Season : ఇదేంటీ కొత్తగా మెగా సీజన్ అనుకుంటున్నారా. ఇండస్ట్రీ లో బడా సినిమాలకి ఎప్పుడు కొదవ లేదు పైగా ఈ మధ్య బాహుబలి పుణ్యమా అని అన్నీ ఇండస్ట్రీస్ కలిసిపోయాయి. ఏ ఇండస్ట్రీ లో పెద్ద సినిమా వచ్చినా అందరు చూసేస్తున్నారు. సో కొత్తగా మళ్ళీ మెగా సీజన్ ఎంటా అనుకుంటున్నారా…. సరే చదవండి ఐతే.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ముఖ్యంగా కుటుంబాల హవా ఎప్పుడు నడుస్తూనే వుంటది. దాంట్లో మెగా కుటుంబ హవా కూడా కనిపిస్తూనే వుంటది. ఆ కుటుంబం నుంచి చిన్నా, పెద్దా అందరినీ కలుపుకొని డజన్ మంది తారలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి నుంచి లైన్ గా సినిమాలు రానున్నాయి. అవేంటో లుక్కేద్దాం

న‌వంబ‌ర్ 14న మెగా ప్రిన్స్ వ‌రుణ తేజ్ మొదటి కొబ్బరి కాయ కొట్టనున్నాడు. తాను న‌టించిన మ‌ట్కా చిత్రం భారీ అంచ‌నాల నడుమ రిలీజ్ అవుతుంది. వ‌రుణ్ కెరీర్ లో ఇది రెండ‌వ పాన్ ఇండియా రిలీజ్ ఇది. వరుస ఫ్లాప్ లో ఉన్నా కూడా కథ మీద నమ్మకం తో నిర్మాతలు భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. మ‌ట్కా అనే క్రీడ నీ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని పాన్ ఇండియాకి క‌నెక్ట్ చేస్తున్నారు చిత్ర బృందం.

ఈ సినిమా తొ ప్రేక్ష‌కుల్ని ఓ కొత్త వ‌ర‌ల్డ్ లోకే మెగా ప్రిన్స్ తీసుకెళ్లనున్నాడని అభిమానులంతా ఎంతో ఆశగా ఉన్నారు. కొంత‌కాలంగా వ‌రుణ్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. దీంతో ఈ సినిమాపై వరుణ్ తో మెగా ఫ్యామిలీ కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్నాయి.

Read Also : ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు… 

ఇక ఈ సినిమా తర్వాత రాబోతున్న మరో సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్. చాల సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి సంక్రాంతి పండ‌గ బ‌రిలో నిలిపారు దర్శక నిర్మాతలు.

గేమ్ ఛేంజర్ అనే సినిమా జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఈ సినిమా డిసెంబ‌ర్ లో రిలీజ్ అవ్వాలి.కానీ అదే టైం లైన్ లో పుష్ప‌-2 వుండడం ఆ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవ్వడం తొ గేమ్ ఛేంజర్ నీ జ‌న‌వ‌రికి పుష్ చేసారు. దాని కోసమే చిరంజీవి విశ్వంభ‌ర సినిమా నీ వాయిదా వేశారు.

ఈ సినిమానే తొలుత పండ‌క్కి రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ చరణ్ సినిమా నీ సంక్రాంతి బరిలో నిలపడం కోసం విశ్వంభర నీ వాయిదా వేసుకున్నట్లు దర్శకుడు వశిష్ఠ ప్రకటించాడు. అందుకని `విశ్వంభ‌ర టార్గెట్ స‌మ్మ‌ర్ అయింది.

మట్కా, గేమ్ ఛేంజర్, విశ్వంభర తర్వాత మెగా కుటుంబం నుంచి రాబోతున్న మరో హీరో ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్.

Read Also :  ఇట్స్ మీనాక్షి టైం

పవర్ స్టార్ నుంచి ఈ సారి ఓజీ, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు రేసులో ఉన్నాయి. హరి హర వీర మల్లు కి ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా దర్శక నిర్మాతలు. మార్చ్ 28 కి వస్తాం అని చెప్పారు దానికి తగ్గట్టు గానే పవన్ ఆ రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ బాగా ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో ఇక డిలే లేదంటూ సెట్స్ కి హాజ‌ర‌వుతున్నారు.

ఆ లెక్కన న‌వంబ‌ర్ నుంచి వ‌చ్చే ఏడాది మిడ్ వ‌ర‌కూ మార్కెట్ లో మెగా సీజన్ క‌నిపిస్తుంది. వీటిల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయి చూడాలి.

Follow us on Instagram 

The post మెగా సీజన్ స్టార్ట్స్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/tollywood-to-witness-the-mega-season-from-november/feed/ 0