MOVIE NEWS

రిలీజ్ సమయంలో అక్కడ ‘గేమ్ ఛేంజర్ ” కు బిగ్ షాక్..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా విడుదల నాలుగు రోజుల్లో ఉండగా తమిళనాట గేమ్ ఛేంజర్ కు సరి కొత్త సమస్యలు ఎదురైనట్లు తెలుస్తుంది… దర్శకుడు శంకర్ ఇండియన్ 3 సినిమా పూర్తి చేయకుండానే వేరే సినిమాకు వెళ్లిపోవడాన్ని కారణంగా చూపుతూ లైకా సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని ఆశ్రయించింది..ఆ రాష్ట్రంలో రిలీజ్ ఆపాలని కోరుతున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది..

ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్స్..నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

ఇండియన్ 2 సమయంలో కూడా దర్శకుడు శంకర్ ఈ సమస్యని ఎదుర్కొన్నారు. అందుకే గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 రెండు సినిమాలు సమాంతరంగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో వివాదం కాలేదు. కమల్ హాసన్ చిత్రమే ముందు వచ్చింది కాబట్టి అక్కడితో సమస్య తీరిందని అంతా అనుకున్నారు..కానీ మళ్ళీ అదే వ్యవహారం షాక్ ఇచ్చేలా ఉంది. అయితే ఈ సమస్యకు దర్శకుడు శంకర్ తగిన వివరణ ఇస్తున్నారట. ఇండియన్ 3 ఇంకొంత భాగమే బ్యాలన్స్ ఉందని, ఖచ్చితంగా అనుకున్న టైంలోనే పూర్తి చేసి ఇస్తానని హామీ ఇస్తున్నట్టు తెలిసింది.

ఈ కాంట్రావర్సి మూలంగా ఇప్పటిదాకా తమిళనాట గేమ్ ఛేంజర్ ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుకాలేదని తెలిసింది. కానీ గేమ్ ఛేంజర్ టీం ఇది సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకం కలుగజేయదు అనే ధీమా వ్యక్తం చేస్తుంది.థియేటర్ల కేటాయింపు, డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందాలు దాదాపుగా ముగిసినట్లు తెలుస్తుంది… 400కి పైగా స్క్రీన్లు కేటాయిస్తున్నట్టు సమాచారం..వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం దిశగా వెళితే బాగుంటుంది.ప్రస్తుతం దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కనుక అక్కడ ఒకవేళ వాయిదా పడితే నష్టం తీవ్రంగా ఉంటుంది

Related posts

RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.?

murali

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

filmybowl

Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

murali

Leave a Comment