MOVIE NEWS

కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’.. ఈ మూవీ గత ఏడాది జూన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు. అయితే  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషలలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

వినాలి వీరమల్లు మాట వినాలి.. ప్రోమో అదిరిపోయిందిగా..!!

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీదత్ కల్కీ-2 సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కల్కీ-2 వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల అవుతుంది.అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో మొత్తం కమల్ హాసనే ఉంటారని తెలిపారు..

ప్రభాస్, కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ఎంతగానో ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు.. సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఈ మూడు పాత్రలే హైలైట్ అవుతాయని ఆయన తెలిపారు. వారితో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందట.ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’ అని అశ్వినిదత్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Related posts

వెంకీ మామ గోయింగ్ బ్యాక్….

filmybowl

అన్ ప్రిడిక్టబుల్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!

murali

ప్రభాస్ కోసం మరో ‘లెజెండరీ యాక్టర్ ని తీసుకొస్తున్న మైత్రి మూవీ మేకర్స్

filmybowl

Leave a Comment