MOVIE NEWS

హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్..

తమిళ్ స్టార్ హీరో ధనుష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు..తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ “నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం” సినిమాను తెరకెక్కించాడు.. మేనల్లుడి కోసం ధనుష్ నిర్మాతగా మారాడు.. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్ గా కూడా మారాడు.రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలలోనటించారు… ఇందులోని గోల్డెన్ స్పారో సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే..

ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!!

ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. వుండర్ బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్ కంపెనీపై తెరకెక్కుతోన్న ఈ సినిమాను తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేయగా తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా ధనుష్‌ తెరకెక్కించిన “రాయన్” సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మేనల్లుడితో తెరకెక్కించిన సినిమా తెలుగులో “జాబిలమ్మ నీకు అంత కోపమా” అనే పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడి యూత్ ను బాగా ఆకట్టుకుంది.

అలాగే ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న’ఇడ్లీ కడాయ్’ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటు దర్శకుడిగా అటు హీరోగా అలాగే నిర్మాతగా ధనుష్ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు.అలాగే ధనుష్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో”కుబేర” అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.. నేషనల్ క్రష్ “రష్మిక మందన్న “ హీరోయిన్ గా నటిస్తుంది..రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

 

Related posts

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!!

murali

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

murali

Leave a Comment