MOVIE NEWS

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం గెస్ట్ గా వచ్చారు.. అలాగే విజయశాంతి కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌లోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్, ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.గతంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. బింబిసార తరువాత కళ్యాణ్ రామ్ కి సాలిడ్ హిట్ పడలేదు.. దీనితో ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..?

ముందు నుంచి ఈ సినిమా కంటెంట్ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ కూడా అద్భుతం గా ఉంది..ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా విజయశాంతి నటించారు..తల్లి కొడుకుల ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది..

పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..ఇదిలా ఉంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు..ఈ సినిమా నిడివి 144 నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది..

Related posts

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!

murali

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

murali

Leave a Comment