టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ సర్వసాధారణమే.. కానీ అన్ని సందర్భాలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడవు.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో మాత్రమే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి..ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వార్ జరుగుతుంది.. ఇదిలా ఉంటే ఈ దసరా కి మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా న్యూస్ వైరల్ అయింది..కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది.
వరుస ప్లాప్స్.. గాడి తప్పిన నితిన్ కెరీర్.. కారణం అదేనా..?
ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ ఆ డేట్ న రాకపోవచ్చని తెలుస్తుంది… ఓజీ మూవీ కనుక ఆ డేట్ న రాకపోతే మాత్రం చిరంజీవి నటించిన విశ్వంభర రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా ఎలాంటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు..ఆగస్టులో వరుసగా వార్ 2,కూలీ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. దీంతో ఈ భారీ సినిమాలు సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఓజీ కనుక అనుకున్న డేట్ కి వస్తే సెప్టెంబర్ నుంచి విశ్వంభర తప్పుకుంటుంది.ఒకవేళ ఓజీ రాకపోతే మాత్రం అదే తేదీన విశ్వంభరను రిలీజ్ చేస్తారని సమాచారం. అదే జరిగితే మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య, చిరంజీవి పోటీ తప్పదు. వీరిద్దరూ ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడి మరీ కలెక్షన్లు సాధించారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గతంలో సంక్రాంతి కి పోటీ పడ్డ వీరు ఈ సారి దసరా కి పోటీ పడనున్నారు.. అఖండ-2, విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలే అయినా రెండూ వేర్వేరు కథలతో వస్తున్నాయి.. మరి సెప్టెంబర్ లో పై చేయి ఎవరు సాధిస్తారో చూడాలి..
