MOVIE NEWS

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు..సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది… ఈ సినిమా రిలీజ్ సందర్బంగా గేమ్ ఛేంజర్ మేకర్స్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది..

రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!!

ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జనవరి 10వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఆంధ్రప్రదేశ్ లో ‘గేమ్ ఛేంజర్’ షోలు ప్రారంభం కానున్నాయి. బెనిఫిట్ షోలకు రూ.600 టికెట్ రేట్స్ నిర్ణయించారు.మొదటి రోజు గేమ్ ఛేంజర్ మూవీ ఆరు షోలు పడనున్నాయి. ఈ ఆరు షోలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరల కంటే రూ.135 (సింగిల్ స్క్రీన్లలో), రూ.175 (మల్టీప్లెక్స్ లో ) పెంచుకోవచ్చు. రెండో రోజు (జనవరి 11వ తేదీ) నుంచి 14వ రోజు(జనవరి 23వ తేదీ) వరకు ఈ పెంపు అందుబాటులో ఉండనుంది.మూవీ రిలీజ్ అయిన రెండు వారాలు ఏపీ సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.282.50 వరకు, మల్టీప్లెక్స్ లో రూ.352 వరకు ఉండనుంది.

15వ రోజు నుంచి అందరికి అందుబాటు ధరల్లోనే గేమ్ ఛేంజర్ టికెట్ రేట్స్ వున్నాయి..తెలంగాణలో మాత్రం ‘గేమ్ ఛేంజర్’ టికెట్స్ రేట్స్ పెంపు విషయం ప్రశ్నగా మారింది.. ఈ సినిమాకు అక్కడ స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల ధరల పెంపులకు పర్మిషన్లు ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించారు..

Related posts

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali

మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

filmybowl

Leave a Comment