MOVIE NEWS

అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..వరుసగా టాలెంటెడ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు.. “కింగ్డమ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమా టైటిల్ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు..

రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..?

ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది..అలాగే పాన్ ఇండియా వైడ్ విజయ్ దేవర కొండకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.. ఈ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఎంచుకోవడం పై విజయ్ దేవరకొండ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..

ఈ టీజర్ కు తారక్ అన్న తో వాయిస్ ఇప్పించాలని ముందే అనుకున్నాం..ఆయన తప్ప అలాంటి డైలాగ్స్ ఎవరూ న్యాయం చేయలేరని పించింది..డైరెక్టర్ లేకపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు తారక్ అన్న ఒప్పుకున్నారు..నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు.. నేను చాలు అనేంత వరకు డబ్బింగ్ చెప్పారు.. నాకు ఎంతో స్పెషల్ గా అనిపించిందని విజయ్ అన్నారు..తారక్ అన్న వాయిస్ తో మా సినిమాకు మరింత హైప్ వచ్చిందని విజయ్ తెలిపాడు..

 

Related posts

స్పిరిట్ : విలన్స్ గా ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!!

murali

NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!!

murali

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

murali

Leave a Comment