MOVIE NEWS

మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. గత ఏడాది “ భోళా శంకర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరూకి ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. దీనితో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న చిరంజీవి “బింబిసారా” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ఠ దర్శకత్వంలో “ విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీని సెట్ చేసాడు.. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలనీ మేకర్స్ భావించినా కూడా అది సాధ్య పడలేదు.. దీనితో ఈ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ కి చిరు ఛాన్స్ ఇస్తున్నారు.‘విశ్వంభర’ మూవీ తర్వాత రోజుకో దర్శకుడు పేరు తెరపైకి వస్తుంది. ఇప్పటికే ఈ లిస్టులో శ్రీకాంత్ ఓదెలా, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆ తరువాత చిరు మూవీ ఏంటి అనేది ప్రశ్నగా మారింది… కానీ చిరు మాత్రం తన అభిమానులను వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

పుష్ప2 టైటిల్ సాంగ్ రిలీజ్.. డిలీటెడ్ సీన్స్ అదిరిపోయాయిగా.!!

తాజాగా మరో దర్శకుడితో చిరు తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది… అది కూడా తనకు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చిరు మరో సినిమా చేయనున్నాడని సమాచారం. ఆ దర్శకుడు ఎవరో కాదు యంగ్ డైరెక్టర్ బాబీ..గతంలో తనకి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఇంకో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాబి చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే లైన్ లో అనిల్ రావిపూడి కూడా ఉండటంతో చిరు ఎవరితో ముందు సినిమా చేస్తారనేది సస్పెన్స్ గా మారింది…

Related posts

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

murali

రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!!

murali

ఎస్ఎస్ఎంబి : బిజీఎం కోసం రంగంలోకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment