పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఫౌజీ”.. సీతారామం ఫేమ్ హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రోజుకో ఆసక్తికరమైన అంశం లీక్ అవుతోంది.లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో, హను మార్క్ ఎమోషన్, విజువల్ గ్రాండియర్ చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి…ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త భామ ఇమాన్వి నటిస్తోంది.ప్రభాస్ సరసన ఈ క్యూట్ బ్యూటీ ఏ విధంగా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..?
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.. అలియాభట్ పాత్ర కేవలం గెస్ట్ రోల్ అయినప్పటికీ, స్టోరీలో కీలకమైన భాగమని తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అలియా యువరాణిగా కనిపించనుందట. ఇప్పటికే RRR సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అలియా భట్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అయింది..అలియా ఎంట్రీతో నార్త్ ప్రేక్షకుల్లో ఫౌజీ పై మరింత ఆసక్తి పెరిగేలా కనిపిస్తోంది.
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ వుంది.. బాహుబలి,RRR, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సాధించాయి..కల్కి తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ లో ఫౌజీ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది..ప్రస్తుతం పౌజీ షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ అందించనున్నారు..