గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మార్చి 27 రాం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఇందులో రామ్ చరణ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో బీడీ పట్టుకుని ఉన్నాడు. దీంతో మూవీ రంగస్థలంను మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. అయితే ఈ సినిమా కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జరుగుతున్నట్టు సమాచారం.ఉత్తరాంధ్ర ప్రాంతం స్లాంగ్ లో నే ఈ సినిమాలో రామ్ చరణ్ డైలాగ్స్ చెప్పనున్నాడు.
క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..?
గతంలో రంగస్థలం సినిమా కూడా అలాగే తెర కెక్కింది.ఆ సినిమాను కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర స్లాంగ్ తోనే దర్శకుడు సుకుమార్ తీశారు. ఆ మూవీ ఎంతటీ పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చరణ్ కెరీర్ ను రంగస్థలం మూవీ మరో స్థాయికి తీసుకెళ్ళింది… ఇప్పుడు బుచ్చిబాబు తీస్తున్న సినిమాలో కూడా సేమ్ ఉత్తరాంధ్ర స్లాంగ్ సెంటిమెంట్ ను వాడేస్తుం డటంతో ఈ దెబ్బతో మరోసారి రంగస్థలంకు మించి హిట్ కొడుతామని మూవీ టీమ్ భావిస్తుంది..
ఉగాది రోజున ఈ మూవీ గ్లింప్స్ వచ్చే అవకాశం వుంది…చరణ్ పుట్టినరోజునే గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ చూశారు. కానీ మిక్సింగ్ పూర్తి కాక ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు..ఈ మూవీ గ్లింప్స్ వచ్చిన తర్వాత మూవీపై మరింత హైప్ పెరిగే అవకాశం వుంది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్. మ్యూజిక్ అందిస్తున్నాడు..