MOVIE NEWS

ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!!

సెన్సేషనల్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ స్టార్టింగ్ లో శివ, సత్య వంటి గొప్ప చిత్రాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం బీ గ్రేడ్ మూవీస్ చేస్తున్నాడు.. తాను తెరకెక్కించిన శివ, సత్య, రంగీల వంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి.. ఆ సినిమాలు ఆర్జివిలోని గొప్ప దర్శకుడిని పరిచయం చేసాయి.. కానీ ఆ చిత్రాల సక్సెస్ ఆర్జివికి ఎంతలా ఎక్కేసింది అంటే తనకంటే గొప్ప దర్శకుడు లేడని అనుకునేంతలా చేసింది.. దానికి తోడు బాగా తాగుడికి బానిస కావడంతో ఆర్జివి బీ గ్రేడ్ సినిమాలు తీసుకునే స్థాయికి దిగజారిపోయారు.. సోషల్ మీడియాలో పాపులర్ అయినా లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్  ఆర్జివి కంటపడ్డారా అంతే వారితో సినిమా చేయకుండా వదిలిపెట్టేవారు కాదు.ప్రస్తుతం ఆర్జివి డెన్ నుంచి మరో కళాఖండం రాబోతుంది..

బన్నీ లైనప్ విషయంలో సూపర్ ట్విస్ట్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?

మలయాళీ భామ శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)తో ఆర్జివి శారీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా యూత్ కి విపరీతంగా నచ్చేసింది..తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ని గమనిస్తే ఎప్పుడూ చీరలే కట్టుకునే ఓ అమ్మాయిని ఓ ఫోటోగ్రాఫర్ చూడగానే ఇష్ట పడతాడు..ప్రేమ అంటూ ఆమె వెంట తిరుగుతూ ఆ ప్రేమ మరీ ఎక్కువయి, ఆ అమ్మాయి తనకే సొంతం అనే భావనతో సైకోగా మారి చివరికి ఏం చేస్తాడు ? ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథతో ఈ శారీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఆరాధ్య దేవి, సత్య యదు, సాహిల్, అప్పాజీ అంబరీష్, కల్పలత వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శారీ సినిమా కథని ఆర్జీవీ రాసి ప్రజెంట్ చేయగా రవి శంకర్ నిర్మాణంలో గిరి కృష్ణ తెరకెక్కించారు..ఇక ఈ శారీ సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందాలను మరింత ఘాటుగా తెరకెక్కించి ఆర్జీవి సినిమాపై యూత్ కి ఇంట్రెస్ట్ కలిగేలా చేసారు.. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..

Related posts

సినిమా కంటెంట్ కి అంతా స్టన్ అయిపోతారు.. శంకర్ షాకింగ్ కామెంట్స్..!!

murali

మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!!

murali

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

murali

Leave a Comment