MOVIE NEWS

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.కానీ ఆ సినిమా మొదటి షో నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా దేవర సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు.దర్శకుడు కొరటాల త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందించనున్నారు.

ఇకపై థియేటర్స్ లో వారికి నో ఎంట్రీ ..తమిళ చిత్ర నిర్మాతమండలి కీలక నిర్ణయం..!!

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ తన తరువాత సినిమా చేస్తున్నాడు..ఈ మూవీ ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2 “సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ 2025 ఆగష్టు 14 న రిలీజ్ చేసేందుకు  ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.ఇప్పటికే నెల్సన్ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కి బాగా నచ్చినట్లు తెలుస్తుంది.త్వరలోనే వీరి కాంబోలో సినిమా రాబోతుంది.నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన జైలర్ మూవీ సూపర్ హిట్ అయింది.ఆ తరువాత ఏ హీరోతో నెల్సన్ కమిట్ కాలేదు.దీనితో ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా వచ్చే ఏడాది మొదలు కానున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్, హోంబలే ఫిలిమ్స్ పోటీ పడగా… చివరకు ఎన్టీయార్ సితార సంస్థ వైపే మొగ్గు చూపాడని సమాచారం.ఈ సినిమా కనుక ఓకే అయితే సితార సంస్థకు ఇదే మొదటి తమిళ సినిమా అవుతుంది.

Related posts

రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

filmybowl

మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!!

murali

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment