MOVIE NEWS

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..!!

టాలీవుడ్ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన టాలెంట్ తో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫి అందించి వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు.. జానీ మాస్టర్ అందించే స్టెప్స్ ఎంతో కొత్తగా ఉంటాయి..టాలీవుడ్ టాప్ హీరోలు అయిన రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలకు జానీ మాస్టర్ అదిరిపోయే కొరియోగ్రఫీ అందించారు.. అయితే ఇటీవల తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “తిరుచిత్రాంబలం”.. సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు..

డాకు మహారాజ్ : డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. బాబీ పనితనానికి ఫిదా అయ్యరుగా..!!

ఆ చిత్రంలో మేఘం కరిగేలే సాంగ్ సూపర్ హిట్ అయింది.. ఆ పాటకు జానీ మాస్టర్ అందించిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఆ చిత్రం తమిళ్ మరియు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఇటీవల 2022 సంవత్సరానికి గాను ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డు లలో భాగంగా “తిరుచిత్రాంబలం”.. సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి.. ఒకటి ఉత్తమ నటిగా నిత్యా మేనన్ కి అవార్డు రాగా మరొకటి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్ కి అవార్డును ప్రకటించారు.. అయితే అనూహ్యంగా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు.

తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ని లైంగికంగా వేధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.. ఆ డాన్సర్ కేసు పెట్టడంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసారు.. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్‌కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. జానీను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు తెలుస్తుంది.తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రానంతవరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు.ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో అప్పుడే ఆ పదవి నుంచి తొలగించాలని అసోసియేషన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ ఆ ఎన్నికలలో విజయం సాధించారు.భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ అయిదోసారి డ్యాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.. ఇక కొత్త పాలక వర్గం ఎన్నుకున్న అనంతరం జానీని ఈ అసోసియేషన్‌ను తొలగించినట్లు సమాచారం..

Related posts

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

murali

అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఆ రోజే నా ?

filmybowl

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

Leave a Comment