MOVIE NEWS

చైతూ లైనప్ లో మరో భారీ సినిమా.. వర్కౌట్ అవుతుందా..?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాలో అద్భుతమైన ప్రేమ కథను చూపించాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు..ఈ మూవీతో నాగచైతన్య తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు..

ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. స్టార్స్ కి కాంపౌండ్స్ లేవు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమా మూడు రోజులకు గాను ఏకంగా 60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లుగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరో నాగచైతన్య ‘తండేల్’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..చైతూ తన తరువాత సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ మూవీ తరువాత నాగ చైతన్య లైనప్ లో మరో భారీ మూవీ వచ్చి చేరింది. నాగ చైతన్య – బోయపాటి కాంబోలో ఓ భారీ మూవీ సెట్ అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రొమాంటిక్ మూవీస్ చేస్తున్న చైతూ మాస్ ఇమేజ్ అందుకోవాలనే ఉద్దేశంతో బోయపాటితో మూవీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో అఖండ 2 అనే భారీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సినిమా ముగిసిన తరువాతే బోయపాటితో నాగచైతన్య సినిమా గురించి క్లారిటీ రానుంది..

 

Related posts

ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!!

murali

Unstoppable with NBK : తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన వెంకీ మామ.. వీడియో వైరల్..!!

murali

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

Leave a Comment