Anirudh - The most wanted music director
MOVIE NEWS

అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ !

Anirudh - The most wanted music director
Anirudh – The most wanted music director

Anirudh : అనిరుథ్‌ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరు తలుస్తున్న పేరు. హీరోల దగ్గర నుంచీ నిర్మాత లు, దర్శకులు అందరికీ అనిరుధ్ ఏ కావాలి. ఇక అభిమానుల సంగతి చెప్పనే పనిలేదు వి వాంట్ అనిరుధ్ అని సోషల్ మీడియా లో అదే పని గా అడుగుతున్నారు

అభిమానుల మాట కాదనలేక అనిరుధ్ నీ వాళ్ళ సినిమా లో తీసుకుంటున్నారు.

అనిరుధ్ లో వున్న మ్యాజిక్ ఏంటంటే చిన్న ప్రాజెక్ట్ ఆ పేద్ద ప్రాజెక్టు అని వుండదు. హీరో ఎవ‌రున్నా స‌రే క్రేజీ, వైరల్ మ్యూజిక్ ఇవ్వడం అనిరుథ్‌ స్పెషాలిటీ.

అక్కడక్కడ ట్యూన్స్ రిపీట్ అవుతూనే వుంటాయి కానీ అవేవీ సినిమాపై ప్రభావం చూపడం లేదు. రెడీమెడ్ గా కిక్ ఇస్తూ, థియేటర్ లో మోత మోగించే మ్యూజిక్ ఇవ్వడంలో అనిరుధ్ దిట్ట.

ముఖ్యంగా థియేటర్స్ లో సినీ ప్రేమికులకు బీజీఎం తో హై ఇవ్వడం అనిరుధ్ లో ప్రత్యేకత. సినిమాల్లోని చాలా సీన్ల‌ని త‌న బీజియ‌మ్స్ తో నిల‌బెట్టాడు. అందుకు ఎన్నో సినిమాలు ఊదాహరణ. త‌మిళంలో క్రేజీ చిత్రాల‌కు అత‌నే కేరాఫ్ అడ్ర‌స్స్‌.

ఇప్పుడు టాలీవుడ్ తయారౌతున్న చాలా సినిమాలు అనిరుథ్‌ వైపే వెళ్తున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి కలయికలో వస్తున్న సినిమాకి అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే గౌతమ్ కొత్తవాళ్ళతో చేస్తున్న మ్యాజిక్ సినిమాకి కూడా ఆయనే బాణీలు సమకూరుస్తున్నాడు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా అనిరుథ్‌ పేరునే ఖరారు చేసుకున్నారు. దేవిశ్రీ‌ని ఆప్షన్ గా పెట్టుకున్న చివరికి అనిరుథ్ వైపే వెళ్ళారు నాని, శ్రీ‌కాంత్ ఓదెల.

Read Also : ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

నానికి ఇది అనిరుధ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా. ఇంతకుముందు జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకి కలసి పని చేశారు. జెర్సీ పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ వినిపిస్తూనే వుంటది.

ఇవే కాకుండా అనిరుధ్ నీ సంగీత దర్శకుడిగా తీసుకోడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అటు అనిరుధ్ కూడా గతంలో ఆచి తూచి అడుగులు వేశాడు కానీ ఇప్పుడు తెలుగు సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడని తెలుస్తుంది.

తెలుగు లో కోటి, మణిశర్మ, కీరవాణి తర్వాత పెద్ద సినిమాలకి సంగీతం ఇచ్చింది అంటే గుర్తొచ్చేది త‌మ‌న్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌.

కానీ ప్రస్తుతం అనిరుథ్ కూడా ఓ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. తెలుగులో ఇక నుంచి తరుచుగా కొత్త త‌ర‌హా సంగీతం వినపడిద్ది అని సినీ ప్రేమికులు బలంగా నమ్ముతున్నారు.

Follow us on Instagram

Related posts

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

murali

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

filmybowl

Leave a Comment