Anil Ravipudi won the race before it started
MOVIE NEWS

పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి

Anil Ravipudi won the race before it started
Anil Ravipudi won the race before it started

Anil Ravipudi : ఇదేంటీ…. ఐదెప్పుడు జరిగింది
అస్సలు పోటీ ఏ స్టార్ట్ అవ్వలేదు అప్పుడే గెలిచేసాడు అంటున్నారు అనుకుంటున్నారా

అస్సలు పోటీ లో నుంచి తీసేసిన సినిమా నీ మళ్ళీ పోటీ లో నిలబెట్టడం అంటే ఒకరకం గా గెలుపే కదా. అందుకే రావిపూడి గెలిచాడు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంకా కథ మీకు అర్థం కాలేదా. సరే ఐతే చదవండి.

2025 సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది ప్రేక్షకుల్లో. ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి తెలుగులో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన రావిపూడి ప్రతి సినిమా బంపర్ హిట్ కొట్టింది.
అయితే దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతానికి అనిల్ విక్టరీ వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేశారు. ఈ సినిమాని సంక్రాంతి కే రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు.

అయితే అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ డిసెంబర్ రిలీజ్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయింది. కాబట్టి ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ నుంచి రెండో సినిమా హోల్డ్ చేయమని దిల్ రాజు కి ఇతర నిర్మాతలు నుంచి రిక్వెస్ట్ అందినట్టు తెలుస్తుంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. దాంతో రాజు కాస్త వెనక్కి తగ్గాడు. సినిమా నీ పోస్ట్ పోన్ చెయ్యాలని అనుకున్నాడు.

అయితే ఈ విషయంలో అనిల్ రావిపూడి మాత్రం అస్సలు తగ్గేదే లె అన్నట్టుగా పంతం పట్టి కూర్చొని ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా తమ సినిమా టైటిల్ కి తగ్గట్టు సంక్రాంతికి రావాల్సిందే అని చెబుతున్నారట. అయితే ఇప్పుడు దిల్ రాజు రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ రెండిటికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also : మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

దీంతో దిల్ రాజు రామ్ చరణ్ ను వ్యక్తిగతంగా కలిసి వెంకీ – రావిపూడి సినిమా కూడా ఎందుకు పండక్కి రిలీజ్ చేయాల్సి వస్తుందో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఈ విషయంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి మధ్య కాస్త గట్టిగానే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది చివరికి అనిల్ రావిపూడి తాను అనుకున్నది సాధించుకున్నాడు.

సో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి సంక్రాంతికి బరిలో దిగేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్ లోపు పూర్తి చేసే ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

Follow us on Instagram 

Related posts

ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

filmybowl

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

murali

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

murali

Leave a Comment