ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నటన, డాన్స్ పరంగా హీరో రామ్ అద్భుతంగా రానిస్తాడు. కానీ గత కొంతకాలంగా హీరో రామ్ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ప్రస్తుతం రామ్ చేస్తున్న మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఈ సినిమాలో హీరో రామ్ రిఫ్రెషింగ్ అవతార్ లో కనిపించనున్నారు. ఇందులో అతను సినిమా అభిమానిగా అలరించనున్నాడు.
మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది.ఆంధ్ర కింగ్ తాలూకాలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. వివేక్
మెర్విన్ ద్వయం స్వరపరిచిన సౌండ్‌ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ని అలరించనున్నట్లు సమాచారం. ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ జూలై 18న విడుదల అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సాంగ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతుంది.. అది ఏమిటంటే ఈ సాంగ్ ను హీరో రామ్ రాయగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పాడినట్టు తెలుస్తోంది. ట్రాక్ కోసం ప్రమోషనల్ పోస్టర్లో రామ్ ఉత్సాహంగా తెరచాపతో నాటు పడవపై ప్రయాణిస్తున్నట్లు కనిపించడంప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో పాటు మ్యూజిక్ ప్రమోషన్లు ప్రారంభం కానుండటంతో మేకర్స్ సినిమాకి జోరుగా ప్రమోషన్స్ నిర్వహించనున్నారు.
