గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మించారు .. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.. తండ్రి, కొడుకుగా మాస్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోనున్నాడు..
డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!!
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ఈ సినిమాకు సూపర్ హైప్ తెచ్చిపెట్టాయి.. ఈ సినిమాను మేకర్స్ జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసారు..ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..’ ఇది శంకర్ ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని నాకు అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ గారు తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే.
శంకర్ అంటే తెలుగు వారందరికీ ఎంతో గౌరవం. ఆ గౌరవంతోనే దిల్ రాజు గారు ఈ మూవీని శంకర్ గారితో తీసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న యంగ్ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు.కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి ఎంతగానో గర్వపడుతుంటాం. ఆయనే మా డైరెక్టర్లందరికి అసలైన ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.ఒక దర్శకుడికి వున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ కాన్ఫిడెంట్ ఇచ్చిన దర్శకుడు శంకర్ గారే అని రాజమౌళి తెలిపారు… ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు రాజమౌళి థాంక్స్ కూడా చెప్పారు…