MOVIE NEWS

అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!!

పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు.పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి వెళ్ళారు.
ఐకాన్ స్టార్ వస్తున్నారని తెలిసి టికెట్ లేని వారు కూడా ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం కారణంగానే తాము సరైన పోలీసు బలగాన్ని అక్కడ నిలపలేకపోయామని పోలీసులు తెలిపారు..సమాచారం ఇవ్వని అల్లు అర్జున్ తో పాటు ఆయన టీం మీద కూడా కేసులు నమోదు చేశారు.అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది… ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. అయితే అల్లుఅర్జున్ అరెస్ట్ పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు

బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

జాతీయ అవార్డ్ విన్నింగ్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు. అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేకపోయినా కూడా ఆయనను ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన చర్యను తాను ఖండిస్తున్నట్లు  కేటీఆర్ ట్వీట్ చేసారు… ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది..

Related posts

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

ప్రభాస్ మొదటి సినిమా కథ ఇదే

filmybowl

Leave a Comment