MOVIE NEWS

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

టాలీవుడ్ లో అల్లు vs మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా రచ్చ జరుగుతుంది.ఒకప్పుడు ఎంతగానో కలిసి వుండే ఫ్యాన్స్ ఇప్పుడు మెగా హీరోస్ ఫ్యాన్స్ అంతా ఒక వైపు  ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక వైపు అన్నట్లుగా చీలి పోయారు.అంతా ఒక వైపు వుండే పరిస్థితులు మారిపోయాయి. ఒక్క ఘటన మొత్తం పరిస్థితులను మార్చేసింది… దీనితో సోషల్ మీడియాలో ఈ గొడవలు మరింత దారుణంగా మారాయి.అల్లు అర్జున్,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు.. కొత్తగా ఫ్లెక్స్ ల గొడవలు కూడా మొదలు అయ్యాయి.

అల్లుఅర్జున్ తన ఫ్యాన్స్ ని ఆర్మీ అంటూ సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం తన బిగ్గెస్ట్ చిత్రం “పుష్ప 2” ని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా  ప్రమోట్ చేస్తున్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం భిన్నంగా వున్నాయి… ఏదైతే మెగా బ్రాండ్ తో అల్లు అర్జున్ ఎదిగాడో ఇపుడు ఆ మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ కి యాంటీ అయ్యారు. చాలా చోట్ల అల్లు అర్జున్ సినిమాలు చూసేది లేదు అని మెగా ఫ్యాన్స్ తెగేసి చెబుతున్నారు.ఈ ప్రభావం ఇపుడు పుష్ప 2 పై బాగా పడినట్టు తెలుస్తుంది.. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలకు మన తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ పడాలీ..

పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపు ..పెరిగిన ధరలు ఎలా వున్నాయంటే..?

మెగాస్టార్, పవన్ కల్యాణ్, రాంచరణ్ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మెగా ఫ్యాన్స్ లో క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది..కానీ ఇపుడు ఏపీలో పుష్ప 2 కి బెనిఫిట్ షోస్ కొనేందుకు ఎవరూ ముందుకి రావట్లేదు..దీనితో పుష్ప 2 బెనిఫిట్ షోస్ కి డిమాండ్ లేదు అంటూ ఓ న్యూస్ సినీ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది… సోషల్ మీడియాలో సైతం మెగా ఫ్యాన్స్ పుష్ప 2 సినిమాకి యాంటీ గా ప్రచారం చేస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. ఈ గొడవ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో అని అంతా ఆందోళన చెందుతున్నారు.. మెగాస్టార్ కలుగజేసుకుంటే తప్ప ఈ గొడవకి పరిస్కారం లభించదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

filmybowl

డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..?

murali

సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

filmybowl

Leave a Comment