MOVIE NEWS

చరిత్రలో నిలిచిపోయే పాత్రలో అల్లుఅర్జున్ ..బన్నీపై త్రివిక్రమ్ భారీ ప్రయోగం ..?

పుష్ప సినిమాతో పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టిన అల్లు అర్జున్..ఈ సారి అంతకుమించి అంటూ పుష్ప 2 తో ఇంటర్నేషనల్ మార్కెట్ ని దున్నేయడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు..తెలుగులో ప్రభాస్ తరువాత ఆ రేంజ్ క్రేజ్ వున్న హీరో అల్లు అర్జున్.. పుష్ప 2 కనుక అనుకున్న రేంజ్ లో హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ ఆపటం ఎవ్వరి వల్ల కాదు..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు బ్రాండ్ గా మారింది.డిసెంబర్ 5 న పుష్ప 2 గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఇక వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో అల్లు అర్జున్‌ తరువాత మూవీ ఉంటుందని తెలుస్తుంది..అల్లుఅర్జున్ ,త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడూ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న నాలుగో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ,బన్నీ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా ఊహించిన దాని కంటే మరింత భారీగా ఉంటుందని తెలుస్తుంది . తాజాగా సినిమా కథ విషయంలో ఓ లీక్‌ కూడా వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో మొదటి సారి త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా దాదాపు వందల కోట్ల బడ్జెట్‌తో అతి భారీ చిత్రంగా రూపొందనుంది.

వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..?

ఈ సినిమాకు చెంఘీజ్ ఖాన్ చరిత్రకు సంబంధం ఉందని చాలా మంది అంటున్నారు.చెంఘీజ్ ఖాన్ చరిత్రంలోని ఓ కీలకమైన అంశాన్ని తీసుకుని బన్నీ సినిమాకు త్రివిక్రమ్ మూల కథ సిద్ధం చేశారు అని సమాచారం.మంగోలియన్లు అందరినీ ఏకం చేసి శత్రువుల నుండి అలాగే అనేక ఇబ్బందులను ఎదుర్కొని వీరుడిగా నిలిచిన చెంఘీజ్ ఖాన్ చరిత్రను త్రివిక్రమ్ తన అద్భుతమైన రైటింగ్ స్కిల్ తో కథగా మార్చి మొదటి సారి భారీ ప్రయోగం చేయనున్నాడని తెలుస్తుంది.మరి ఈ సినిమా ఎలా వుండనుండో తెలియాలంటే కొద్దీ రోజులు ఎదురుచూడాల్సిందే..

Related posts

ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది….

filmybowl

ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..?

murali

‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌….

filmybowl

Leave a Comment