MOVIE NEWS

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.?

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా రాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్ 2 తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు. బన్నీ మాట్లాడుతూ.. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయ్యాక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కెరీర్ లో బ్రేక్ తీసుకున్నాను. ఆ సమయంలో నేను చాలా మారాలి అనిపించింది. మనం ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి అంటే మారాలి. ఆ సమయంలో ఎవరయినా నాలో నెగిటివ్స్ చెబితే అస్సలు వినేవాడ్ని కాదనీ అది నాకు అస్సలు నచ్చలేదని బన్నీ తెలిపారు.

కానీ నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే అందరూ చెప్పే విషయాలు కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అప్పట్నుంచి ఎవరు ఏం చెప్పినా వింటూ రానివి నేర్చుకుంటున్నాను. అందరి ఆశీస్సులు ఉంటే కచ్చితంగా మీ అందరూ గర్వించే స్థాయికి చేరుకుంటాను అని బన్నీ అన్నారు.షూటింగ్ ఉంటే త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేస్తాను.కానీ షూటింగ్ లేకపోయినా కూడా త్వరగా పడుకొని ఉదయాన్నే 4-5 గంటలకు లేవాలి అది నాలో నేను మార్చుకోవాల్సిన మొదటి విషయమని అల్లు అర్జున్ తెలిపారు.ఈ షో లో బన్నీ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Related posts

పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!!

murali

నేను ఏ తప్పు చేయలేదు..అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

murali

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

Leave a Comment