MOVIE NEWS

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా డిసెంబర్ 5 న థియేటర్ లో రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ అయితే తెచ్చింది కానీ.. అంతకు మించి వివాదాన్ని కూడా తీసుకొచ్చింది.. ఆ వివాదాన్ని లాక్కొలేక పీక్కోలేక అల్లు అర్జున్ సతమత మవుతున్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకి ముదురుతుంది.. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. తాను ఏమి తప్పు చేయలేదని అల్లుఅర్జున్ తప్పంతా అల్లుఅర్జున్ దే అని పోలీసులు చెప్పుకొస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఇష్యూ బాగా వైరల్ గా మారింది.. అయితే ఏది ఏమైనా ఈ ఇష్యూ  టాలీవుడ్ కొంప ముంచిందని చెప్పాలి..

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తో పాటూ ఆయన్ని పరామర్శించిన సినీ ప్రముఖులందరిపై ఫైర్ అయ్యారు.అంతటితో ఆగకుండా ఇక నుంచి సినిమాలకు సంబంధించి బెని ఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు.అయితే ఈ న్యూస్ విన్నాక నిర్మాత దిల్ రాజుకు భయం పట్టుకుంది… ఎందుకంటే ఆయన నిర్మించిన మూడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఓ పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన దిల్ రాజు సినిమాలకు ఊహించని ఎదురుదెబ్బగా మారనుంది.

దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అంత భారీ మొత్తంలో రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమే అని తెలుస్తుంది…అలాగే వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తో పాటుగా బాలయ్య ‘డాకు మహారాజ్’ ను నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే దిల్ రాజుకి భారీ నష్టాలు రావడం గ్యారెంటీ అని తెలుస్తుంది..

Related posts

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..?

murali

గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment