ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాపై ఫోకస్ చేసారు.స్టార్ డైరెక్టర్ అట్లీ తో ఐకాన్ స్టార్ భారీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో మూవీ గురించి ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.కానీ చర్చలు మాత్రం దాదాపు పూర్తి అయిపోయాయని తెలుస్తోంది.
గ్లింప్స్ తో సంచలనం.. ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేగా..!!
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజు ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని న్యూస్ బాగా వైరల్ అవుతుంది… అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. మరికొన్ని గంటల్లో స్పెషల్ బ్లాస్టింగ్ అప్ డేట్ ఉంటుందని.. వేచి ఉండాలంటూ ఆ సంస్థ ట్వీట్ వేసింది. మాస్, మ్యాజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ ఆ ట్వీట్ లో పేర్కొనింది.ఈ ట్వీట్ బన్నీ, అట్లీ సినిమాకు సంబంధించిందే అని తెలుస్తుంది… ఈ ట్వీట్ తో మూవీ పై పూర్తి కన్ఫర్మేషన్ వచ్చేసింది.
ఈ సినిమాను బన్నీ బర్త్ డే రోజు ప్రకటించి.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను మేకర్స్ ఓ వీడియో రూపంలో ప్రకటించబోతున్నారు. ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యేలా చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లుఅర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం..