MOVIE NEWS

ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ పూరీకి ఛాన్స్ ఇచ్చాడు.. దీనితో పూరీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా పూరీ కెరీర్ ని కాపాడలేకపోయింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి..

బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!!

విజయ్ దేవరకొండ తో మొదలెట్టిన ‘జె జీఎం'(జన గణ మన) మధ్యలోనే ఆగిపోయింది. ముంబైలో ఆ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ‘లైగర్’ రిజల్ట్ తర్వాత ఫైనాన్షియర్స్ డ్రాప్ అవ్వడంతో.. పూరి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు.మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ కి డిజాస్టర్ టాక్ వచ్చినా బిజినెస్ మాత్రం బాగానే జరిగింది. కానీ అవి ‘లైగర్’ నష్టాలు తీర్చడానికే సరిపోయాయి. పూరితో సినిమా చేయాలనే ఆశతో నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనేసి నష్టాలపాలయ్యారు. అందువల్ల పూరి.. నిరంజన్ రెడ్డికి ఓ సినిమా చేసి పెట్టి ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.కానీ పూరీకి హీరోలు సెట్ అవ్వడం లేదు.

రవితేజ కోసం పూరి కథ సిద్ధం చేసుకున్నాడు. ఇది పొలిటికల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ అని సమాచారం.కానీ రవితేజ కూడా ఇప్పుడు ప్లాపుల్లో కూరుకుపోయాడు… అలాగే రవితేజ లైనప్ లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.దీనితో రవితేజతో సినిమా తీయడం పూరీకి ఇప్పట్లో కష్టమే అని తెలుస్తుంది.అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద తేజ సజ్జ డేట్స్ ఉన్నాయని సమాచారం.కానీ తేజ సజ్జ కూడా కూడా ఇప్పుడు ఖాళీగా లేడు.ప్రస్తుతం తేజ సజ్జ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే కథ కూడా పూరీ వద్ద లేడు. దీంతో గోపీచంద్ ని కలిసి కథ వినిపించాలని పూరీ భావిస్తున్నట్లు సమాచారం.. గోపిచంద్ కూడా పూరీతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. దీనితో త్వరలో వీరి కాంబో లో సినిమా రాబోతుందని సమాచారం.

Related posts

సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..?

murali

పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..?

murali

అఖండ 2 తాండవం…. అదరహో….

filmybowl

Leave a Comment