టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో వరుస కామెడీ చిత్రాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యన్నారాయణ వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన నరేష్ తక్కువ సమయంలోనే 50 పైగా చిత్రాలలో నటించి మెప్పించాడు..పాత్ర ఏదైనా ఈ అల్లరోడు తన అద్భుతమైన నటనతో ఎంత నవ్వించగలడో అంతే రీతిలో ఏడిపించగలడు.ప్రస్తుతం కామెడీ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో అల్లరి నరేష్ జానర్ మార్చి సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అల్లరి నరేష్ తన 63వ సినిమాతో బిజీగా ఉండగా, ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ : షూటింగ్ బిగ్ అప్డేట్.. జోరు చూపిస్తున్న పవర్ స్టార్..!!l
అల్లరి నరేష్ తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను విభిన్న పాత్రలతో అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నాడు..తాజాగా ఆయన మెహర్ తేజ్ దర్శకత్వంలో ఓ నూతన చిత్రంలో నటిస్తున్నారు. ఇది అల్లరి నరేష్ కెరీర్లో 63వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా,చిత్ర యూనిట్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ పోస్టర్లో నరేష్ ఆల్కహాలిజం లో మునిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఇది ఒక భ్రమ, వాస్తవికత మధ్య నడిచే కథ అని తెలుస్తుంది.
ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ రుహాని శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
