MOVIE NEWS

అకిరా నందన్ తో ఖుషి 2..ఎస్.జె సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్. జె సూర్య విలన్ గా నటించారు..ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఎస్. జె సూర్య ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.. అదేవిధంగా పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..అనే ప్రశ్నకు ఎస్ జే సూర్య సమాధానమిచ్చారు.

డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..?

తనకు ప్రస్తుతం నటుడిగా చాలా కంఫర్ట్ ఉందని ఆయన వెల్లడించారు.“ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకీరా నందన్‌ను నేను ఫ్లైట్‌లో చూశాను. చాలా అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారి లాగానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు కనుక ఛాన్స్ ఇస్తే అలాగే సరైన టైం కలిసి వస్తే.. అది జరుగుతుందేమో చూడాలి.” అని ఎస్. జె.సూర్య తెలిపారు..

అలాగే తాజాగా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కొడుకు అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ ఎంతగానో కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు… ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా..అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లుగా ఆమె తెలిపారు… అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తున్నట్లు ఆమె వెల్లడించారు..పవర్ స్టార్ తనయుడు సినిమాల్లోకి కనుక వస్తే తాను చేయబోయే మొదటి సినిమాకు భారీ క్రేజ్ లభిస్తుంది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆ మూమెంట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

Related posts

‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Unstoppable with NBK : తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన వెంకీ మామ.. వీడియో వైరల్..!!

murali

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

murali

Leave a Comment