Akhil Akkineni on his way to reveal his next film
MOVIE NEWS

అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఆ రోజే నా ?

Akhil Akkineni on his way to reveal his next film
Akhil Akkineni on his way to reveal his next film

Akhil Akkineni : అక్కినేని ఇంటి నుంచి మూడో తరం వారసుడుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. సిసింద్రీగా సుమారు ఏడాది వయస్సులోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు అఖిల్.. ఇక పెద్దయ్యాక మనం క్లైమాక్స్ లో తళుక్కుమని కనిపించినా.. ఔరా అనిపించుకున్నాడు. ఇక అఖిల్ హీరో గా ఎంట్రీ ఇస్తే టాప్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు.

అప్పటి టాప్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వం లో తన తోలి సినిమా గా అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.

ఇక దీంతో నాగ్.. అఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి విక్రమ్ తో హలో సినిమా ని అన్నపూర్ణ బ్యానర్ లో చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ, అఖిల్ లక్ మాత్రం కలిసి రాలేదు.

ఇక అల్లు అరవింద్ రంగం లోకి దిగి బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా అఖిల్ కు మొదటి హిట్ ఇచ్చింది కానీ ఆ హిట్ అంత హీరోయిన్ పూజ హెగ్డే ఖాతాలో కి వెళ్ళింది.

ఈ సినిమా తరువాత యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా గురించి అక్కినేని ఫాన్స్ ఏ మాట్లాడడం మానేశారంటే ఈ సినిమా ఎలాంటిదో అందరికి తెలుసు.

ఏజెంట్ కోసం అఖిల్ మూడేళ్ల పాటు కష్టపడి 8 ప్యాక్ చేసాడు. ఎన్నో వాయిదాల తరువాత ఏజెంట్ రిలీజ్ అయ్యి ఏమైంది అందరికి గుర్తుంది.

ఎడిటింగ్ కి సమయం ఇవ్వకుండా.. సినిమాను ఆతృతగా రిలీజ్ చేయడంతో.. అసలు సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. పోనీ ఓటీటీలో అయినా చూద్దాం అనుకుంటే.. ఆ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు.

Read Also : ‘వేట్టయాన్’ మూవీ రివ్యూ

ఏజెంట్ సినిమా తరువాత అఖిల్ అస్సలు పత్తా లేకుండా పోయాడు. ఈ మధ్యనే ఒక ఈవెంట్ లో అభిమానులు నాగార్జున ని అడగగా “అఖిల్ మంచి హిట్ తోనే మీ ముందుకు వస్తానని చెప్పినట్లు చెప్పుకొచ్చాడు”.

ఇక ఆ హిట్ కోసం అఖిల్ సాధన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా కమిట్ అయ్యాడు. వినరో భాగ్యం విష్ణు కథ సినిమా తో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ మురళీ కిశోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని అప్పట్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి అప్డేట్ రాలేదు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం యూవీ క్రియేషన్స్ లోనే అనిల్ అనే కొత్త దర్శకుడు తో అఖిల్ తదుపరి సినిమా ఉంటుందట. కానీ, ఈలోపే నాగార్జున తన సొంత బ్యానర్ లో నే మరల అఖిల్ ను రీ లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నాగ్ కు బాగా నచ్చేసిందట ఇది తన బ్యానర్ లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ని దసరా రోజున బయటకి చెప్పనున్నట్టు తెలుస్తోంది.ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ మళ్ళి ఖుషి అవుతారు అనడం లో సందేహం లేదు. ఇప్పటికే రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతోనైనా అఖిల్ విజయాన్ని అందుకుంటాడా.. ? లేదా..? అనేది చూడాలి.

Follow us on Instagram

Related posts

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

murali

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!!

murali

Leave a Comment