Akhanda2 - Mass combination is back
MOVIE NEWS

అఖండ 2 తాండవం…. అదరహో….

Akhanda2 - Mass combination is back
Akhanda2 – Mass combination is back

Akhanda2 : తెలుగు ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లకి కొదవ లేదు. కానీ కొన్ని కాంబినేషన్స్ అలా అనౌన్స్ చేయగానే లేదా వాళ్లిద్దరూ టీం అప్ అవుతున్నారు అనగానే ఇండస్ట్రీ వర్గాల నుంచి , సినీ అభిమాని వరకు అలెర్ట్ అవుతారు. అలా అందరినీ అలెర్ట్ చేసిన కాంబినేషన్ ఏదైనా వుంది అంటే ఈ డెకేడ్ లో అది బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఏ.

ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి చేతులు కలిపింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కలయికలో ఈ సారి అఖండ 2 వస్తున్న విషయం తెలిసిందే.

ఇవాళ అఖండ2 పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సారి టీమ్ తో పాటు బాలయ్య తన ఇద్దరు కుతుర్లని భాగం చేశాడు. వాళ్ళ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అఖండ రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు అందరికీ గుర్తుండే వుంటది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో అఖండ టైటిల్ కు తగ్గట్టే అఖండ విజయం సాధించి రికార్డుల బూజు దులిపి బాలయ్య బోయపాటి కాంబినేషన్ అద్భుత విజయం సాధించింది.

అఖండ కి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు, ఇంకా చెప్పాలంటే నార్త్ నుంచి సినిమా లవర్స్ కూడా కోరుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష ఫలించింది.

అఖండ2 ఆఫిషియల్ గా లాంచ్ అయింది అలాగే అఖండ 2లో చాలా ఆసక్తికరమైన విశేషాలున్నాయి అంటున్నారు చిత్ర బృందం.

మొదటి భాగం లాగే బాలయ్య కి పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ ని కొనసాగిస్తూనే ఈసారి ఇంకా డివోషనల్ టచ్ ని పెంచుతూ కమర్షియల్ గా ప్రజెంట్ చేస్తున్నాడంట బోయపాటి.

అఖండలో ఇంటర్వెల్ తర్వాతే దైవత్వాన్ని టచ్ చేశారు. కానీ అఖండ 2 తాండవంలో పేర్లు పడటం దగ్గరి నుంచే అఘోరాగా బాలయ్య మాస్ ని చూడొచ్చని అంటున్నారు. ఇది ఒక రకంగా అఖండ రుద్ర సికిందర్ ఘోర కేరక్టర్ మీదే రన్ అయ్యే సినిమా అని తెలుస్తుంది.

ఇప్పుడు ప్రస్తుతం సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి సంబంధించిన కొన్ని కీలక ఎపిసోడ్లు ఈ సినిమా లో ఉంటాయని దానికి బాలయ్య బోయపాటి తమదైన రీతిలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

Read Also : మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న కలయిక కావడంతో కాంబినేషన్ ప్రకటించిన రోజు నుంచే దీని మీద విపరీతమైన హైప్ వచ్చేసింది. 14 రీల్స్ నిర్మాణ సంస్థ కూడా భారీ బడ్జెట్ తో తీయబోతుంది ఈ చిత్రాన్ని .

అఖండ క్యాస్టింగ్ నే కొనసాగించబోతున్నారు అని తెలిసింది. ఈసారి కూడా తమన్ ఈ సినిమాకి పిల్లర్ అవబోతున్నాడు. అఖండ సినిమా కి సరికొత్త మ్యూజిక్ , సరికొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సినిమా ని ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు తమన్

సో ఈసారి సినీ ప్రేమికులకు తమన్ అంతకు మించి ఇవ్వాలని, ఇస్తాడని చాలా నమ్మకంగా ఉన్నారు.

సో అఖండ తాండవం కోసం వచ్చే సంవత్సరానికి ఇద్దం అవుదాం

Follow us on Instagram

Related posts

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

murali

వర , తంగం రిలేషన్ తేడాగే ఉందే

filmybowl

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

filmybowl

Leave a Comment