MOVIE NEWS

అఖండ 2 : హిమాలయాలకు పయనమయిన చిత్ర యూనిట్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “..సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయింది.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఎంతగానో నచ్చజేసింది.. ఈ సినిమా మంచి వసూళ్లు సైతం సాధించింది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ అప్డేట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది..మే చివరి నాటికి ఈ సినిమా టాకీ పార్ట్ మాత్రమే కాకుండా సగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేయాలని బోయపాటి శ్రీను టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి.ఈ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!!

ఈ సినిమాలో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు..ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ, ఆది కాంబినేషన్‌లో బోయపాటి కొన్ని సీన్స్‌ను కూడా షూట్ చేశారు..ఈ సినిమాను దర్శకుడు సరికొత్త లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నాడు.. అందులో భాగంగా మహాకుంభమేళా సమయంలో సినిమా టీం రియల్ లొకేషన్స్‌లో కొన్ని సీన్స్ షూట్ చేసింది..

తాజాగా ఈ మూవీ టీం హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ‘అఖండ 2’ సినిమా షూటింగ్ కోసం కొన్ని కీలక లొకేషన్లను వెతుకుతున్నట్లు సమాచారం..ఈ సినిమా రిజల్ట్ బోయపాటికి చాలా కీలకంగా మారింది. దీనితో చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

Related posts

ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!!

murali

Leave a Comment