MOVIE NEWS

అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!!

నందమూరి నట సింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి..వీరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కి పండగే..అయితే గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.. తాజాగా ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ప్రకటించారు..బాలయ్య, బోయపాటి కలయికలో రూపొందుతున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి..

తాజాగా ఈ సినిమాకు ‘అఖండ 2 తాండవం’ అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేసారు.. ఈ ‘ చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. విజయదశమి సందర్భంగా… వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న అఖండ తాండవం చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ప్రోమోను కూడా విడుదల చేశారు. తమన్ నేపథ్య సంగీతం అందించిన ఆ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

ఇవాళ మొదలైన ‘అఖండ 2 తాండవం’ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ జాయిన్ అయ్యారు. దర్శకుడు బోయపాటి శ్రీను తన స్టైల్ ఫాలో అవుతూ భారీ యాక్షన్ సీక్వెన్సుతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. టాప్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య మీద భారీ ఫైట్ తీస్తున్నట్లు సమాచారం.అది పూర్తి అయిన తర్వాత కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించనున్నారని చిత్ర బృందం తెలిపింది..టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు..

Related posts

ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..?

murali

దేవర రికార్డుల ఊచకోత మొదలు

filmybowl

బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

filmybowl

Leave a Comment