MOVIE NEWS

అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!!

నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “అఖండ “ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది..బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` షూటింగ్ లో బిజీ అయిపోయారు. అఖండ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ పై బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటున్నారు. నటీనటుల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఎంపిక చేసారు… ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ టైప్ కాదని సమాచారం. ఈ సినిమాలో సంయుక్తది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించారు. మహా కుంభమేళాకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తెరకెక్కించారు… ఈనెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని సమాచారం.బాలకృష్ణ కూడా ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు..ఈ సినిమాకు కూడా తమన్ స్పీకర్స్ పగిలిపోయే మ్యూజిక్ అందించనున్నాడు..

 

Related posts

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

murali

బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment