MOVIE NEWS

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు…ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది…

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలో మేకర్స్ ప్రచారం పనులు సైతం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు…ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీని లైన్ లో పెట్టాడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో బాలయ్య తన తరువాత సినిమా ప్రకటించారు.. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.. త్వరలో తెరకెక్కబోయే సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది..రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు..

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

“అఖండ 2-తాండవం “ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు వున్నాయి..ఈ సినిమాలో బాలయ్య ని నెక్స్ట్ లెవ్ లో చూపించబోతున్నట్లు సమాచారం.బాలయ్య అఖండ-2 షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. అయితే  ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ రివీల్ చేసింది. అఖండ 2 షూటింగ్ గురించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం

Related posts

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

murali

మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని

filmybowl

అఫీషియల్ : “గేమ్ ఛేంజర్” గ్రాండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న పవర్ స్టార్..!!

murali

Leave a Comment