After Sukumar, it's with Prashanth Neel for Ram Charan
MOVIE NEWS

రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

After Sukumar, it's with Prashanth Neel for Ram Charan
After Sukumar, it’s with Prashanth Neel for Ram Charan

Prashanth Neel Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ కథానాయికగా గా తమిళ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 20 లేదా 25 న ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు ప్రొడ్యూసర్ ఆల్రెడీ అనౌన్స్ చేసారు.

ఈ చిత్రం తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో నెక్స్ట్ మూవీ చేయనున్నాడు చరణ్ ఆ తరువాత తనకి రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ ని అందించి ప్రేక్షకులకి మరింత దెగ్గర చేసిన సుకుమార్ తో మరొక మూవీ కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు.

ఇక ఆ తర్వాత ఎవరితో చేయబోతున్నారు ane దానికి ఆల్మోస్ట్ సమాధానం దొరికేసింది. KGF, సలార్ తో మాస్ మూవీ అంటే ఇలా కూడా తీయచ్చు అని పాన్ ఇండియా లెవెల్ లో మాస్ కి కొత్త అర్ధం చెప్పిన ప్రశాంత్ నీల్ తో తదుపరి చిత్రం కమిట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, త్వరలో ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also : దృశ్యం – ది కంక్లూషన్

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్ ఖాతాలో సలార్ 2, కెజిఎఫ్ 3 కూడా ఉన్నాయి

అయితే ప్రస్తుతం టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఈ మూడు సినిమాల తర్వాత ప్రశాంత్…. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ కమిట్ అయ్యారని ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు.

దసరా కానుకగా ఈ సినిమా గురించి కన్ఫర్మేషన్ రానున్నట్టు ఇండస్ట్రీ లో చెప్తున్నారు

Follow us on Instagram

Related posts

నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో

filmybowl

‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!!

murali

‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!

murali

Leave a Comment