టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హ్యాపీ డేస్ మూవీతో ప్రేక్షకులలో గుర్తింపు సంపాదించుకున్న తమన్నా.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన తమన్నా దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా అదరగొట్టింది.అయితే టాలీవుడ్ లో కొత్త భామలు రావడంతో తమన్నా క్రేజ్ తగ్గుతూ వచ్చింది.. దీనితో ఈ భామకు స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ కరువయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత బాగా తెలిసిన తమన్నా తన కెరీర్ ని మళ్ళీ ఊపందించేందుకు వరుసగా స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?
అలాగే బాలీవుడ్ లో పలు హాట్ వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి అందరిని ఆకట్టుకుంది…ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో నటించిన తమన్నా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది..ఈ సినిమా తర్వాత తనకు బాలీవుడ్ అవకాశాలు బాగానే వచ్చాయని చెప్పాలి.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా బాహుబలి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాహుబలి సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక తమన్నా మాత్రం ఈ సినిమాలో నటించిన తర్వాత తనకు అసలైన కష్టాలు మొదలయ్యాయని తెలిపింది.. బాహుబలి సినిమా పూర్తి అయిన తర్వాత నా మైండ్ లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి..బాహుబలి కంటే పెద్ద సినిమాలో మళ్ళీ నటించగలనా.. నేను మళ్ళీ అలాంటి పాత్రలు చేయగలనా అని ఎన్నో ఆలోచనలు నన్ను ఇబ్బందికి గురిచేశాయని ఆమె తెలిపింది..