MOVIE NEWS

ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించారు.. అవన్నీ కూడా బాలయ్య స్థాయిని అమాంతం పెంచేసాయి..కానీ బాలయ్య సినీ కెరీర్ లో మరింత అద్భుతమైన చిత్రం ఏది అంటే మాత్రం టక్కున “ఆదిత్య 369“ అని చెబుతారు..టాలీవుడ్ సినీ చరిత్రలో తెరకెక్కిన అద్భుత చిత్రాల జాబితాలో బాలయ్య నటించిన ”ఆదిత్య 369”మూవీ ముందుంటుంది..ఇంతటి అద్భుత చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ అంతా ఇంటి పేరు కోసమేనా..?

బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య కృష్ణ కుమార్ గా అలాగే శ్రీకృష్ణ దేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు బాలయ్య సీక్వెల్‌ ను ప్రకటించారు. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా అలరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్‌లో ఆదిత్య 369కి సీక్వెల్‌ రాబోతుందని వెల్లడించారు.. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు..

ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు.ఈ అప్‌డేట్‌ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్‌లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించారు..ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్‌ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం ఎదురు చూడాల్సిందే.భూత, భవిష్యత్‌ కాలాల్లోకి హీరో హీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే “ఆదిత్య 369”కథ.. అయితే బాలయ్య ప్రకటించబోయే ఆదిత్య 999 మ్యాక్స్ కథ మరింత భిన్నంగా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది కూడా బాలయ్య సస్పెన్స్ గా ఉంచినట్లు సమాచారం..

Related posts

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

filmybowl

కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..?

murali

మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

filmybowl

Leave a Comment