ఇండియాలోనే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..స్అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన దీనికి మాత్రమే సీక్వెల్ తీయనున్నారు..అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది… 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమాను అప్పటి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు..
తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ “ఛావా”..!!
గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ గ్రాండ్ గా తెరకెక్కింది.దర్శకుడు సింగీతం ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సూటవుతారనే ఉద్దేశంతో బాలయ్యని ఈ సినిమాలో తీసుకున్నారు.కమల్ ఈ సినిమా చేయలేకపోవడంతో బాలయ్యే ఈ సినిమా కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా , బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరి విలన్ గా నటించారు..
1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించడం ఫ్యాన్స్ కి సైతం ఎంతో కొత్తగా అనిపించింది.సినిమా అంతా ఒకెత్తు అయితే ఇళయరాజా సాంగ్స్ మరొక ఎత్తు అని చెప్పాలి.వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అన్ని సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాయి..ప్రస్తుత జనరేషన్ కోసం ఈ సినిమాను మళ్ళీ 4K లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే రీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు..